ఆకాంక్ష రాంజన్ స్టన్నింగ్ లుక్
తాజాగా ఆకాంక్ష షేర్ చేసిన బోల్డ్ ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఇది రన్నింగ్ కార్ లో జాలీ మూడ్ లో ఉన్నప్పటి ఫోటోషూట్.
ఆకాంక్ష రాంజన్ కపూర్ పరిచయం అవసరం లేదు. 2020 నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'గిల్టీ'తో నటిగా అరంగేట్రం చేసింది. తర్వాత 2021 వెబ్ సిరీస్ 'రే' .. 2022 నెట్‌ఫ్లిక్స్ ఇండియా చిత్రం 'మోనికా, ఓ మై డార్లింగ్'లో నటించింది. తెలుగులో సందీప్ కిషన్ సరసన సివి కుమార్ 'మాయావన్'లోను నటించింది. 2017 చిత్రం మాయావన్‌కి ఇది సీక్వెల్ గా రూపొందింది.
ఆకాంక్ష ఇంతకుముందు కొత్త సంవత్సరం వేడుకల్లో కనిపించింది. న్యూఇయర్‌లో కొత్త హోప్స్ తో ప్రయత్నాలు చేస్తానని తెలిపింది. మరోవైపు ఆకాంక్ష ఫిట్ నెస్ ఫ్రీక్ గా కనిపిస్తోంది. దీనికోసం జిమ్ లో నిరంతరం శ్రమిస్తోంది. పర్ఫెక్ట్ టోన్డ్ ఫిజిక్ ని ఆవిష్కరించే స్టన్నింగ్ ఫోటోషూట్లను ఇన్ స్టా వేదికగా ఆకాంక్ష షేర్ చేస్తోంది.
తాజాగా ఆకాంక్ష షేర్ చేసిన బోల్డ్ ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఇది రన్నింగ్ కార్ లో జాలీ మూడ్ లో ఉన్నప్పటి ఫోటోషూట్. ఇందులో బ్లూ టాప్ ధరించి అందాలను ఆరబోసింది ఈ బ్యూటీ. ఆకాంక్ష బ్లూ ఇన్నర్ హద్దు మీరి అందాలను ఎలివేట్ చేస్తోందంటూ అభిమానులు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోగ్రాఫ్ వెబ్ లో వేగంగా వైరల్ అవుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే...ఇటీవల జిగ్రాలో ఒక చిన్న కామియో పాత్రలోను ఆకాంక్ష కనిపించింది. అయితే ఒక పూర్తి స్థాయి సినిమా లేదా వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ భామ దర్శకనిర్మాతలతో మంతనాలు సాగిస్తోందని సమాచారం. తదుపరి సినిమాని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.