సూపర్‌స్టార్ పెద్ద నాటకాలోడు: NSD డైరెక్టర్
కింగ్ ఖాన్ షారూఖ్ కూడా మొదట నాటకాలోడు. ఆ తరవాతే సూపర్‌స్టార్ అయ్యాడు! అని తెలిపారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD ) డైరెక్టర్ చిత్తరంజన్.
నాటక రంగం నుంచి వచ్చిన చాలా మంది నటులు సినీరంగంలో ఉన్నత స్థానాన్ని అందుకున్నారు. పెద్ద స్టార్లుగా వెలుగొందారు. చిరంజీవి, రజనీకాంత్, షారూఖ్ ఖాన్ లాంటి స్టార్లు నాటక రంగం నుంచి వచ్చి సినీరంగంలో ఎదిగారు. వీరంతా నటశిక్షణాలయాల్లో ఎన్నో నాటకాలాడారు. స్టేజీ డ్రామాల్లో గొప్ప ప్రతిభను కనబరిచాకే పెద్ద తెర వైపు వెళ్లారు. అక్కడా గొప్ప విజయాలు అందుకున్నారు.
కింగ్ ఖాన్ షారూఖ్ కూడా మొదట నాటకాలోడు. ఆ తరవాతే సూపర్‌స్టార్ అయ్యాడు! అని తెలిపారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD ) డైరెక్టర్ చిత్తరంజన్. షారుఖ్ ఖాన్ `నాటక్‌వాలా` అని ఆయన వ్యాఖ్యానించారు. ఖాన్ నాటక రంగ పునాదులు అతడి ప్రపంచ స్థాయి స్టార్‌డమ్‌కు సహకరించడంలో కీలక భూమిక పోషించాయని అన్నారు. షారూఖ్ `నాటక్‌వాలా` .. ఆ తరువాత సూపర్‌స్టార్ అని చిత్తరంజన్ వ్యాఖ్యానించారు. ఖాన్ ప్రత్యేకమైన ప్రతిభ, నటనా విధానం, ఆత్మ విశ్వాసం వంటి వాటిని కీర్తించారు. తనపై తనకు ఉన్న నమ్మకమే ఖాన్ ని ఇంతటివాడిని చేసిందని ఆయన అన్నారు. ఖాన్ నాటక నేపథ్యం అతడిని తెరపై అద్భుతమైన స్టార్ గా ఆవిష్కరించిందని, అతడి విభిన్న శైలి ప్రపంచ ఆకర్షణకు స్టేజీ డ్రామానే సహకరించిందని తెలిపారు.
నాటక రంగంలో బలమైన పునాదిని కలిగి ఉంటే అతడి స్టార్ డమ్ వేగంగా విస్తరిస్తుందని చిత్తరంజన్ అన్నారు. వినోద పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందించడానికి అవసరమైన ధైర్యం ఖాన్ కి నాటకాలే ఇచ్చాయని అన్నారు. థియేటర్ రంగం నుంచి వచ్చిన వారు సినీరంగంలో వేగంగా ఎదుగుతారని కూడా విశ్లేషించారు. భారతీయ థియేటర్, సినిమా, టెలివిజన్‌లో ప్రఖ్యాత వ్యక్తి అయిన త్రిపాఠి ప్రశంసలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
షారుఖ్ ఖాన్ తదుపరి `కింగ్` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అతడి నటవారసురాలు సుహానా ఖాన్ కీలక పాత్రను పోషిస్తోంది. పఠాన్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.