రా పుటేజ్ తోనే గురువుని థ్రిల్ చేసిన శిష్యుడు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-24 05:14 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. గ్రామీణ నేప‌థ్యంలో సాగే స్పోర్స్ట్ డ్రామాగా చిత్రం ఉండ‌బోతుంద‌ని ప్ర‌చారంలో ఉంది. రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌ర్ పుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్త‌యింది. తాజాగా ఈ రెండు షెడ్యూళ్ల రా పుటేజ్ ను బుచ్చిబాబు గురువు సుకుమార్ చూసి థ్రిల్ అయ్యారుట‌. రెండు షెడ్యూళ్ల‌లో థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్ష‌కుల్ని ఎగ్జైట్ మెంట్ కు గురి చేసేలా ఉన్నాయ‌ని కితాబిచ్చారుట‌.

బుచ్చిబాబు ప‌నిత‌నాన్ని ప్ర‌శింసించారుట‌. రెండు షెడ్యూళ్ల‌తోనే ఈ రేంజ్ లో మెప్పించాడంటే? బుచ్చిబాబు స్టోరీని ఎంత బ‌లంగా రాసుకున్నాడో అద్దం ప‌డుతుంది. ఈనెల 27 నుంచి మూడ‌వ షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. ఈ షెడ్యూల్ హైద‌రాబాద్ లో నే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సినిమాకి అవ‌స‌ర‌మైన సెట్స్ కొన్నింటిని రామోజీ ఫిలిం సిటీ స‌హా హైద‌రాబాద్ శివార్ల‌లో నిర్మించారు. త‌దుప‌రి షెడ్యూల్ అక్క‌డే ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది.

ఇందులో చ‌ర‌ణ్ కి జోడీగా జాన్వీ క‌పూర్ నటిస్తోంది. రెండు షెడ్యూళ్ల షూటింగ్ లో చ‌ర‌ణ్ తో పాటు జాన్వీ కూడా పాల్గొంది. మ‌రి మూడ‌వ షెడ్యూల్ లో జాన్వీ భాగ‌మ‌వుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. ఆర్సీ 16 స‌క్సెస్ చ‌ర‌ణ్ కి అత్యంత కీల‌కం. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వా త భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సోలో రిలీజ్ `గేమ్ ఛేంజ‌ర్` అంచ నాలు అందుకోవ‌డంలో దారుణంగా విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే.

రిలీజ్ కి ముందు సినిమా గురించి ఓ రేంజ్ లో ఊద‌ర‌గొట్టినా? తొలి షో అనంత‌రం స‌త్తా తేలిపోయింది. దీంతో చ‌ర‌ణ్ బుచ్చిబాబు సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే సుకుమార్ ద‌ర్శ‌క త్వంలో చ‌ర‌ణ్ మ‌రో సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం సుకుమార్ రెస్ట్ మోడ్ లో ఉన్నారు. పుష్ప‌-2 రిలీజ్ అనంత‌రం ఆయ‌న రిలాక్స్ అవుతున్నారు. ఇంకొన్ని నెల‌లు పాటు ఆయ‌న విరామంలోనే ఉంటారు. అటుపై చ‌ర‌ణ్ 17వ చిత్రం ప‌నులు మొద‌లు పెట్ట‌నున్నారు.

Tags:    

Similar News