షో స్టాపర్: IFFI2024 ఉత్సవాల్లో అక్కినేని కోడలు
ఇంత బిజీలోను ఇప్పుడు అక్కినేని కుటుంబం ప్రతిష్ఠాత్మక ఇఫీ -2024 ఉత్సవాల్లో ప్రత్యక్షమైంది.
నాగ చైతన్య - శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్నారు. వారి వివాహ ఆహ్వాన పత్రిక ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం పెళ్లి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా జరగనుందని కథనాలొచ్చాయి.
ఇంత బిజీలోను ఇప్పుడు అక్కినేని కుటుంబం ప్రతిష్ఠాత్మక ఇఫీ -2024 ఉత్సవాల్లో ప్రత్యక్షమైంది.20 నవంబర్ నుంచి 28 నవంబర్ వరకూ జరిగే ఈ సినిమా పండుగకు టాలీవుడ్ నుంచి చాలామంది అటెండవుతున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున- అమల, నాగచైతన్య- శోభిత దంపతులు ఈ వేడుకలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇఫీ ఉత్సవాల నుంచి వారి ఫోటోలు కూడా ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఇఫీ వేడుకల్లో అక్కినేని కోడలు శోభిత ధూళిపాల ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. లైట్ పింక్ కలర్ పంజాబీ డ్రెస్ ధరించిన శోభిత బ్లాక్ రేబాన్ ధరించి ప్రత్యేకంగా కనిపించారు. నాగచైతన్య సూట్ లో స్టైలిష్ గా కనిపించగా, ఎప్పటిలానే నాగార్జున నవమన్మధుడి అవతారంలో కనిపించారు. అమలా డీసెంట్ కాటన్ చీరలో స్మైలిస్తూ నాగ్ చెంతనే ఉన్నారు.
#IFFI2024లో చక్కదనం .. వారసత్వం సజీవంగా ఉన్నాయి! యువ సామ్రాట్ #నాగచైతన్య & #శోభిత ధూళిపాళ ANR టైమ్‌లెస్ మాస్టర్ పీస్ ప్రత్యేక ప్రదర్శనకు ముందు రెడ్ కార్పెట్‌ను అలంకరించారు.. అని ఈ ఫోటోలకు ట్యాగ్ ఇచ్చారు. #ANR100 #SoChay హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అభిమానుల్లో వైరల్ గా మారుతోంది.
నాగార్జున అక్కినేని త్రోబ్యాక్ ఇంటర్వ్యూలో తన కాబోయే కోడలు గురించి మాట్లాడారు. జాతీయ మీడియా ఇంటర్వ్యూలో శోభిత కెరీర్ సెలక్షన్ గురించి నాగ్ ప్రశంసలు కురిపించాడు. చై- శోభిత జంట సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఇక శోభిత .. నాగ చైతన్యతో డేటింగ్ ప్రారంభించడానికి చాలా కాలం ముందు తనకు తెలుసునని ఇంటర్వ్యూలో నాగార్జున వెల్లడించాడు. తను ఒక అందమైన అమ్మాయి. స్వీయ నిబంధనల ప్రకారం జీవితాన్ని గడిపే వ్యక్తి అని నాగ్ వ్యాఖ్యానించాడు. శోభిత ఎలాంటి సినిమాలు లేదా సిరీస్ లు అయినా చేసి ఉండవచ్చు.. కానీ తన కెరీర్ విషయంలో తాను ఏం చేయాలో తెలివిగా నిర్ణయిస్తుంది. ప్రశాంతంగా సొంత ఎంపికలతో ఆకట్టుకుంటోంది అని అన్నారు. నాగచైతన్య- శోభిత ఇద్దరూ ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారని అది తాను చూసానని నాగ్ అన్నారు.