'అక్కినేని ఫ్యాన్స్ ఫిబ్రవరి 6న ఒక షర్ట్ కొని పెట్టుకోండి'

ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సినిమాకు 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ధీమా వ్యక్తం చేసారు.

Update: 2024-11-05 12:58 GMT

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడానికి మేకర్స్ గ్రాండ్ గా ఈవెంట్ చేసారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తారీఖున విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సినిమాకు 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ధీమా వ్యక్తం చేసారు.

''ఏడాదిన్నర క్రితం మేము ‘తండేల్‌’ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు 2024 డిసెంబర్ ను టార్గెట్ గా పెట్టుకున్నాం. కానీ ఈ సినిమాలో ఉండే కాంప్లికేషన్స్ వల్ల అనుకున్న సమయానికి రావడం లేదు. ఇది మామూలుగా చేసే షూటింగ్ కాదు. సముద్రం మీద తుఫాన్ క్రియేట్ చెయ్యాలి.. ఒక పెద్ద షిప్ కావాలి. వాఘా బార్డర్ లో షూట్ చేయడానికి చాలా పర్మిషన్లు కావాలి. ఇవన్నీ కూడా చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నవే. అందుకే గత 25 రోజులుగా నాగ చైతన్యతో షూటింగ్ కూడా చెయ్యలేదు. ఇంకా 22 డేస్ షూటింగ్ మిగిలి ఉంది''

''మిగిలిన షూటింగ్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇండియాలో వేరే దేశం ఫ్లాగ్ పెట్టి ఒక నావల్ షిప్ తీసుకురావాలి. దానికి అనుమతి తీసుకోవడం చాలా కష్టం. సీజీలో చేయొచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ సీజీలో అయినా సరే వేరే దేశానికి చెందిన షిప్ ని చూపించాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. దీని కోసం టీమ్ కి తగినంత టైం ఇవ్వాలి'' అని బన్నీ వాసు అన్నారు.

''తండేల్ సినిమా చాలా బాగా వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రోడక్ట్ ని ఫిబ్రవరి 7న తీసుకొస్తాం. ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే.. '100% లవ్' సినిమాతో ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్ గా నాపేరు వేయించిన వ్యక్తి నాగచైతన్య. సుకుమార్ ఛాన్స్ ఇస్తే, అల్లు అరవింద్ సపోర్ట్ చేస్తే, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చి కూడా నన్ను ప్రొడ్యూసర్ గా పరిచయం చేసిన హీరో ఆయన. 'తొలి సినిమాకి నిర్మాతగా ట్యాగ్ ఇచ్చారు కదా.. నువ్వు ఆయనకు ఏమి ఇస్తావ్?' అని అల్లు అరవింద్ అడిగారు. నేను ఒకటే చెప్తున్నా.. ఈ సినిమాని తీసుకెళ్లి 100 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతా. దానికి శతవిధాలా ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తాను. ఎంత కష్టపడాలో అంతలా కష్టపడతాను. దేవుడు ఆశీస్సులతో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరుతుంది''

''అక్కినేని అభిమానులు అందరూ ఫిబ్రవరి 6వ తారీఖున ఒక మంచి షాపింగ్ మాల్ కి వెళ్లి షర్ట్ కొనుక్కోండి. కాలర్ ను చాలా బాగా ఐరన్ చేయించి పెట్టుకోండి. ఫిబ్రవరి 7న తండేల్ మార్నింగ్ షో చూసిన తర్వాత మీరు కాలర్ ఎత్తుకుని తిరుగుతారు. అలాంటి సినిమాని మేము డెలివర్ చేయబోతున్నాం. గీతా ఆర్ట్స్ నుంచి మేమిచ్చే పక్కా ప్రామిస్ ఇది. సాయి పల్లవి.. క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్. ఒక సిల్వర్ స్క్రీన్ ని గోల్డెన్ స్క్రీన్ గా మార్చే సత్తా ఆమెకు ఉంది. ఆమె ఆరా ఎంత పవర్ ఫుల్ అనేది నేను కళ్లారా చూసాను. మా ఇంట్లో ఒక మంచి మహాలక్ష్మి(సాయి పల్లవి), చైతన్య మాతో ఉన్నప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమాని తీసుకెళ్లడం నిజంగా అంత పెద్ద పనికాదు. వంద శాతం ఈ చిత్రాన్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడతాం'' అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News