మన కింగ్ కి ఇదే కరెక్ట్ టైమ్..!

సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వచ్చేలా ఉందని ఇక ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేస్తానని అక్కినేని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశాడు నాగార్జున.

Update: 2024-07-05 06:30 GMT

సీనియర్ హీరోల్లో సినిమాల వేగం తగ్గించిన వారిలో కింగ్ నాగార్జున కూడా ఉన్నారు. కెరీర్ లో హిట్లు ఫ్లాపులు కామనే కానీ నాగార్జునకు ఈమధ్య సరైన కథలు దొరకట్లేదని లేటెస్ట్ టాక్. బంగార్రాజు తో పర్వాలేదు అనిపించుకున్న నాగార్జున మళ్లీ ఫ్లాప్ బాట పట్టగా నా సామిరంగ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వచ్చేలా ఉందని ఇక ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేస్తానని అక్కినేని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశాడు నాగార్జున.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హంగామా చేస్తున్నాయి. కింగ్ నాగార్జున ఒకదానికి మించి మరోటి అనేట్టుగా సినిమాలు అదరగొట్టేస్తున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులంతా కూడా ఇతిహాస కథలను వెండితెర మీద చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. రామాయణ, మహాభారత కథల్లో అంశాలతో సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా క్లైమాక్స్ లో మహాభారతం టచ్ చేసి వావ్ అనిపించాడు నాగ్ అశ్విన్.

ఐతే నాగార్జున కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అన్నమయ్య, రామదాసు లాంటి డివోషనల్ సినిమాలు చేశాడు. రొమాంటిక్ హీరోని అన్నమయ్యగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్న డౌట్ ని పటాపంచలు చేసి అన్నమ్మయతో అదరగొట్టాడు నాగార్జున. ఇదే క్రమంలో శ్రీ రామదాసు, షిరిడి సాయి సినిమాలు కూడా వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. ఐతే ఇప్పుడు ఈ టైం లో నాగార్జున అలాంటి ఒక సినిమా చేస్తే మాత్రం అది పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతాలు చేస్తుందని చెప్పొచ్చు.

Read more!

డివోషన కథ అది చిన్నదా పెద్దదా కాదు ఈమధ్య అలాంటి సినిమాలు ఏమొచ్చినా సరే నేషనల్ లెవెల్ లో మంచి సక్సెస్ లు అందుకుంటున్నాయి. ఆల్రెడీ నాగార్జునకు అలాంటి సినిమాలు చేసిన అలవాటు ఉంది కాబట్టి మన కింగ్ మరో డివోషనల్ సినిమా అటెంప్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఎలాగు రాఘవేంద్ర రావు కూడా సినిమాలు చేసి చాలా టైం అయ్యింది కాబట్టి ఆయన డైరెక్షన్ లో అలాంటి ఒక ప్రాజెక్ట్ వస్తే నాగార్జున పేరు నేషనల్ లెవెల్ లో మారుమోగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నాగార్జున ధనుష్ కుబేర సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నితోనే మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నారని టాక్.

Tags:    

Similar News

eac