కింగ్ నుంచి మ‌ళ్లీ అదే రిపీట్!

'నాసామి రంగ' రిలీజ్ త‌ర్వాత కింగ్ నాగార్జున ఇంత వ‌రకూ సోలో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించింది లేదు.

Update: 2024-07-23 02:30 GMT

'నాసామి రంగ' రిలీజ్ త‌ర్వాత కింగ్ నాగార్జున ఇంత వ‌రకూ సోలో ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించింది లేదు. ప్ర‌స్తుతం ధ‌నుష్ తో క‌లిసి 'కుభేర' చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో నాగ్ పాత్ర కీల‌క‌మైంది మాత్ర‌మే. హీరోకి ధీటుగా ఉంటుందా? ఉండ‌దా? అన్న దానిపై స‌రైన స్ప‌ష్ట‌త లేదు. అయితే నాగ్ కెరీర్ లో ఇదే తొలిపాన్ ఇండియా సినిమా కావ‌డం విశేషం. ఇంత‌వ‌ర‌కూ నాగార్జున నుంచి పాన్ ఇండియా సినిమా రాలేదు.

ఈ నేప‌థ్యంలో 'కుభేర' స‌క్సెస్ నాగ్ కి అత్యంత కీల‌క‌మైన‌దిగానూ చెప్పొచ్చు. స‌క్సెస్ అయితే నాగ్ సైతం పాన్ ఇండియాపై దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియాపై దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నాగ్ కూడా సీరియ‌స్ గా తీసుకునే అవ‌కాశం ఉంది. అందుకు 'కుభేర' మంచి బూస్టింగ్ ఇవ్వ‌గ‌ల‌గాలి. ఇక సోలోగా ఇంత‌వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ‌లేదు.

ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నార‌నే ప్రచారం సాగుతుంది త‌ప్ప ఇంత వ‌ర‌కూ క్లారిటీ లేదు. ఒక‌వేళ దాన్ని ప్రారంభించాల‌న్నా ఇప్ప‌ట్లో కుద‌ర‌ని ప‌నిగానే తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 8 కి కూడా నాగార్జున హోస్ట్ గా బాధ్య‌త‌లు తీసుకున్నారు. సీజ‌న్ 3 నుంచి ఆయ‌న కొన‌సాగుతున్నారు. నిర్వాహ‌కులు ఆయ‌న‌కే ఓటేసి ముందుకెళ్ల‌డంతో నాగ్ కూడా కాద‌న‌లేక‌పోతున్నారు.

సీజ‌న్ 8 సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ పూర్తి కాదు. అంత‌వ‌ర‌కూ ఆ షోతోనే బిజీగా ఉంటారు. అంటే నాగార్జున కొత్త సినిమా సెప్టెంబ‌ర్ త‌ర్వాతే మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల స‌మాచారం. అటుపై దాన్ని పూర్తి చేయ‌డ‌నాకి మూడు నెల‌లు స‌మ‌యం తీసుకుంటారు. అంటే ఆ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ చేసే అవ‌కాశం ఉంటుంది. నా సామిరంగ‌ని కూడా అలాగే మొద‌లు పెట్టి మూడు నెల‌ల్లో పూర్తి చేసి రిలీజ్ చేసారు. ఇప్పుడు అదే స్ట్రాట‌జీతో నాగ్ ముందుకెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది.

Tags:    

Similar News