ప్రభాస్ కాదు ఈ స్టార్ హీరో దేవుడు
అయితే తాజాగా అందిన సమాచారం మేరకు.. ఇందులో శివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు, ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్నారని తెలిసింది.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న `భక్త కన్నప్ప` అత్యంత భారీ కాన్వాస్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కాస్టింగ్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో దేవుడి (శివుడి) పాత్రలో నటిస్తాడని ప్రచారమైంది.
అయితే తాజాగా అందిన సమాచారం మేరకు.. ఇందులో శివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు, ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్నారని తెలిసింది. ఇంతకుముందే కాజల్ అగర్వాల్ పార్వతీ దేవి లుక్ విడుదల కాగా అద్భుత స్పందన వచ్చింది. శివపార్వతులుగా అక్షయ్- కాజల్ జంటను తెరపై వీక్షించే అవకాశం ఉంది. కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ ఇంతకుముందు `స్పెషల్ చబ్బీస్` చిత్రంలో జంటగా నటించారు. ఇప్పుడు ఒక తెలుగు సినిమా కోసం జంటగా నటిస్తుండడం ఆసక్తికరం. భక్త కన్నప్ప చిత్రం ఏప్రిల్ 2025లో విడుదల కానుంది.
ఈ భక్తిరస యాక్షన్ డ్రామాలో మంచు మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, మోహన్ బాబు, ప్రీతి ముకుందన్, మధు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ త్వరలో విడుదల కానుండగా, ఈ సినిమా ప్రచారంలో `భక్త కన్నప్ప`కు సంబంధించిన కొన్ని కీలక అప్ డేట్స్ లీకవుతున్నాయి.