నటుడి కొంప ముంచిన ఆ ఒక్క చిన్న లోపం
బాలీవుడ్ లో గొప్ప నటుడిగా ఖ్యాతి ఘడించిన అక్షయ్ ఖన్నా అందుకు ఒక ఉదాహరణ. అతడు చూడటానికి జాసన్ స్టాథమ్ ని పోలి ఉంటాడు. ఆ ఇద్దరికి బట్ట తలతో సమస్య ఉంది.
హాలీవుడ్‌లో జాసన్ స్టాథమ్ అసాధారణ స్టార్ డమ్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. సమకాలీన యాక్షన్ స్టార్స్‌లో అతడికి ఉన్న ఇమేజ్ అసాధారణమైనది. అయితే అతడు తన రూపాన్ని కప్పి పుచ్చేంతటి స్టార్‌డమ్ ని ఆస్వాధిస్తున్నాడు. దశాబ్ధాలుగా అతడు అజేయంగా యాక్షన్ స్టార్ ఇమేజ్ ని కొనసాగిస్తున్నాడు.
నిజానికి చాలా మంది హాలీవుడ్ స్టార్లు సినీరంగంలో తమ రంగు రూపానికి భిన్నంగా స్టార్ డమ్‌ని ఆస్వాధించారు. విల్ స్మిత్ సహా చాలామంది శ్వేతజాతీయులు అసాధారణ స్టార్‌డమ్‌తో అత్యధిక పారితోషికం అందుకునే స్టార్లుగా ఎదిగారు. వారంతా వారి రంగు, రూపం పరంగా కాకుండా వారిలోని ప్రతిభ, డెడికేషన్, పాత్రలోకి చొచ్చుకెళ్లే నైపుణ్యం కారణంగా పెద్ద స్టార్లు అయ్యారు.
అయితే ఆ పరిస్థితి భారతదేశంలో స్టార్లకు ఉంటుందా? అంటే.. వంద శాతం కాదు. కొంతవరకూ ఇక్కడ ఇంకా రంగు రూపం నటుడి కెరీర్ ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయని అంగీకరించాలి. మునుపటి కాలంతో పోలిస్తే ఇది మారుతోంది. కానీ ఇంకా పూర్తిగా మారలేదు.
బాలీవుడ్ లో గొప్ప నటుడిగా ఖ్యాతి ఘడించిన అక్షయ్ ఖన్నా అందుకు ఒక ఉదాహరణ. అతడు చూడటానికి జాసన్ స్టాథమ్ ని పోలి ఉంటాడు. ఆ ఇద్దరికి బట్ట తలతో సమస్య ఉంది. టామ్ క్రూజ్ ఏలిన చోట కూడా యాక్షన్ రారాజుగా జాసన్ ఏలాడు. కానీ అక్షయ్ ఖన్నా తన బట్టతల కారణంగా చాలా అవకాశాల్ని కోల్పోయాడు. అతడు కేవలం తనకు ఉన్న చిన్న లోపం కారణంగా కొన్నేళ్ల పాటు నటనకు దూరమయ్యాడు. ఇప్పటికీ అతడు తన ఉనికిని పరిశ్రమలో చాటగలుగుతున్నాడు అంటే దానికి కారణం అతడిలోని అసాధారణ ప్రతిభ, నటనలో అంకితభావం మాత్రమేనని అంగీకరించాలి.
అక్షయ్ ఖన్నా బట్టతల తన కెరీర్‌ను ఎలా ప్రభావితం చేసిందో గతంలో పలుమార్లు బహిరంగంగా మాట్లాడారు. అది తన మానిసక ఆరోగ్యాన్ని దెబ్బ తీసింది. `ఒక పియానిస్ట్ తన వేళ్లను పోగొట్టుకున్నట్లే`నని కూడా అతడు ఆవేదన చెందాడు. బాలీవుడ్ లో అత్యుత్తమ నటుడిగా కొనసాగిన అతడు కెరీర్ పరంగా గ్యాప్ లు ఇస్తూ కొనసాగడానికి బట్టతల చికిత్స ఒక కారణం. కెరీర్ ఆరంభం నిండైన జుత్తుతో అందగాడిగా కనిపించాడు. కొన్ని అద్భుతమైన సినిమాలలో నటించి తనకంటూ ఒక ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. కానీ మళ్లీ గ్యాప్ వచ్చింది. దానికి కారణం బట్టతల.
నిజానికి చాలామంది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అగ్ర హీరోలు బట్టతల సమస్యతో ఇబ్బంది పడుతున్నవారే. కానీ దానిని ఎక్కడా బయటపడకుండా మ్యానేజ్ చేయడంలో తలపండిన వారిగా నిరూపించుకున్నారు. ఇది బట్టతలేనా? అని సందేహించేంతగా వారు తమ తలకట్టును మెయింటెయిన్ చేస్తూ ఇప్పటికీ కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటున్నారన్నది కాదనలేని నిజం. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఇంకా చాలా మంది పెద్ద స్టార్లు బట్టతల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ వారంతా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సహా పలు విధానాల్లో తమ తలకట్టును బాగు చేసుకున్నారు. అయితే అక్షయ్ ఖన్నా ఈ విషయంలో వందశాతం సఫలీకృతుడు కాలేదని చెప్పాలి. అతడు తన ఒరిజినల్ రూపంతోనే నటనలో కొనసాగాడు. సహాయనటుడిగా, విలన్ గా తనదైన ముద్ర వేయగలిగాడు. ఇప్పటికీ అతడు కెరీర్ లో వైవిధ్యమైన పాత్రలతో సత్తా చాటుతూనే ఉన్నాడు.
అక్షయ్ ఖన్నా తదుపరి విజయ్ గుట్టే లెగసీ సిరీస్‌లో రవీనా టాండన్‌తో కలిసి నటించనున్నారు. అతడు ఇంతకుముందు అనుపమ్ ఖేర్ నటించిన `ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్`లో నటించాడు. అమెరికన్ సైన్స్-ఫిక్షన్ సిరీస్ `మర్డర్‌బాట్`లో కూడా నటిస్తున్నాడు.