ఆ స్టార్ హీరో సినిమా పెద్దలకు మాత్రమేనా?
తాజాగా ఈ సినిమా కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సినిమా రిలీజ్ కి సెన్సార్ ఆడ్డుకట్ట వేసినట్లు సమాచారం.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో అమిత్ రాయ్ దర్శకత్వంలో 'ఓమైగాడ్ -2' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా లో అక్షయ్ శివుడి పోస్టర్లు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి. అన్ని పనులు పూర్తిచేసుకుని ఆగస్టు 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సినిమా రిలీజ్ కి సెన్సార్ ఆడ్డుకట్ట వేసినట్లు సమాచారం.
సినిమాలో 20కి పైగా సన్నివేశాల్లో మార్పు చేయాలని సీబీఎఫ్ సీ రివైజింగ్ కమిట్ చిత్ర యూనిట్ కి సూచించిందిట. వాటిలో వీడియో..ఆడియోకి సంబంధించిన సన్నివేశాలున్నాయని తెలిపిందని యూనిట్ వర్గాల నుంచి తెలిసింది.
ఈ నేపథ్యంలో సినిమా కి కేవలం ఏ సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వగలమని సెన్సార్ సూచించిందిట.కేవలం పెద్దలు మాత్రమే సినిమా చూడాలని సెన్సార్ భావిస్తోందిట. అయితే మార్పులు కోసం చిత్ర యూనిట్ సిద్దంగా లేదని తెలుస్తోంది.
సినిమాలో అన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తే సారంశంపై ప్రభావం పడుతుందని...సినిమాపై ఇంపాక్ట్ అంతా పోతుందని యూనిట్ భావిస్తోందిట. దీంతో ఓ మైగాడ్ -2 రిలీజ్ పై నీలి నీడయలు కమ్ముకున్నట్లు అయింది. సెన్సార్ ఏ ఇస్తామన్నా...యూనిట్ అంగీకరించనట్లు తెలుస్తోంది. మార్పులు చేస్తే విజయం పై ప్రభావం.. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో రిలీజ్కి ఆటకమనే తెలుస్తోంది.
2012 లో రిలీజ్ అయిన 'ఓ మైగాడ్' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసారు. పెద్దలతో పాటు పిల్లలు కుటుబ సమేతంగా చూడదగ్గ సినిమాగా నిలిచింది. పిల్లలకు కూడా అనుకూలమైన ప్రాంచైజీలో వస్తోన్న ఈసినిమా కేవలం పెద్దల సర్టిఫికెట్ పొందడం సరైంది కాదని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
మరి అంతిమంగా ఎలాంటి మార్పులు చేస్తారు? అన్నది చూడాలి. ఇటీవలే 'ఓపైన్ హైమర్' విషయంలో సెన్సార్ తప్పిదాలు బయటపడిన సంగతి తెలిసిందే. శృంగార సన్నివేశాల్లో 'భగవద్గీత' చదవడంపై సెన్సార్ వాటికి కట్ వేయకపోవడం పై దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే లేచింది.