రేర్ క్లిక్‌: ఒకే వేదిక‌పై టాలీవుడ్ స్టార్ (X) బాలీవుడ్ స్టార్

బాలీవుడ్ సుంద‌రి అలియా భట్ - టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ స్నేహం గురించి తెలిసిందే.

Update: 2024-09-13 07:23 GMT

బాలీవుడ్ సుంద‌రి అలియా భట్ - టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ స్నేహం గురించి తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ ఆర్.ఆర్.ఆర్ సినిమాలో క‌లిసి న‌టించిన‌ప్ప‌టి నుంచి వారి మ‌ధ్య మంచి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఏర్ప‌డింది. ఆలియా తార‌క్ కుమారుడికి మంచి గిఫ్ట్ లు కూడా ఇచ్చింది. తార‌క్ భార్యామణి ప్ర‌ణ‌తికి ఆలియా అత్యంత స‌న్నిహితురాలు అయింది.

అదంతా అటుంచితే ఇప్పుడు ఆలియా- ఎన్టీఆర్ ఓ స్పెష‌ల్ కాజ్ కోసం క‌లిసారు. ఒక గ్రాండ్ ఈవెంట్ నుండి ఫోటోలను షేర్ చేసారు. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో ఇద్ద‌రు ప్ర‌తిభావంత‌మైన స్టార్లు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ త‌మ సినిమాల‌ను ప్ర‌చారం చేసుకునేందుకు వేసిన ఎత్తుగ‌డ ఇది. ఇందుకు సంబంధించిన అరుదైన‌ ఫోటోలు ఇప్పుడు అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ధర్మ ప్రొడక్షన్స్ హోస్ట్ చేసిన ``జిగ్రా వ‌ర్సెస్ దేవర`` ఈవెంట్ నుండి ఈ ఫోటోలు ఇంట‌ర్నెట్ లోకి వ‌చ్చాయి. ఆలియా భట్ షేర్ చేసిన వాటిలో ఎన్టీఆర్, కరణ్ జోహార్ క‌లిసి ఉన్నారు. కొన్ని సోలో ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. ఆలియా ఇలా రాసింది. ``రెండు ప్రపంచాలు ఢీకొంటున్నాయి. #దేవ‌ర ట్రైల‌ర్ మరియు #జిగ్రా ట్రైల‌ర్ ఇక్క‌డ ఉన్నాయి.. అని రాసింది. దీనికి అలియా తో క‌లిసి న‌టించిన `జిగ్రా` సహనటుడు వేదాంగ్ రైనా హార్ట్ ఎమోజీలను షేర్ చేసాడు. జిగ్రా చిత్రాన్ని నిర్మించ‌డ‌మే గాక‌.. దేవర హిందీ వెర్షన్‌ను పంపిణీ చేస్తున్న కరణ్ జోహార్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ వారిని అభినందించాడు.

ధర్మా ప్రొడక్షన్స్ ఈవెంట్ నుండి ఒక ఫోటోని షేర్ చేసి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఇచ్చింది. ``దేవర అలలు జిగ్రా అంతులేని ప్రేమలో పడిపోతాయి. దేవర సెప్టెంబర్ 27న సినిమా(థియేట‌ర్లు)ల్లో. జిగ్రా అక్టోబర్ 11న సినిమాల్లో`` అని రాశారు. ఇప్ప‌టికే దేవ‌ర ట్రైల‌ర్ విడుద‌లై మాస్ ని ఆక‌ట్టుకుంది. భారీ యాక్ష‌న్ తో ర‌క్తి క‌ట్టించింది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ , సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో మళ్లీ సినిమా చేస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌తి అభిమాని కాల‌ర్ ఎగ‌రేసుకునేలా దేవ‌ర ఉంటుంద‌ని తార‌క్ ఇప్ప‌టికే ప్రామిస్ చేసిన సంగ‌తి తెలిసిందే. జిగ్రా ట్రైల‌ర్ విడుద‌లైంది. నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమ్ కానుంది. జిగ్రా మూవీ విజ‌యంపైనా ఆలియా ధీమాగా ఉంది.

ఒక బాలీవుడ్ స్టార్ న‌టించిన సినిమాని... ఒక టాలీవుడ్ స్టార్ న‌టించిన సినిమాతో క‌లిపి ఒకే వేదిక‌పై ఇలా ప్ర‌చారం చేయ‌డం అనే ఎత్తుగ‌డ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఇదే తొలిసారి. ఇది ఎంతో గొప్ప ప‌రిణామం. టాలీవుడ్ బాలీవుడ్ అనే అంత‌రాన్ని ఇది ఎంత‌గా త‌గ్గించిందో అర్థ‌మ‌వుతోంది. ఇది ఆరంభం మాత్ర‌మే. మునుముందు మ‌న స్టార్లు బాలీవుడ్ స్టార్ల‌తో క‌లిసి చాలా అద్భుతాలు చేయ‌బోతున్నారు. హృతిక్- ఎన్టీఆర్ న‌టిస్తున్న వార్ 2తో ఇది ప‌రాకాష్ఠ‌కు చేరుతుంద‌ని అంచ‌నా. త‌దుప‌రి రోహిత్ శెట్టి సింగం ఎగైన్ లో ప్ర‌భాస్ న‌టిస్తున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. డార్లింగ్ క్రేజ్ మ‌రో స్థాయిని ఆవిష్క‌రిస్తుందన‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News