నా ముఖానికి శస్త్ర చికిత్స మీరు చూసారా? నటి సీరియస్!
అలియా భట్ ఇటీవల తన రూపాన్ని మార్చుకునేందుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని కథనాలొచ్చాయి. దీనిపై ఇన్‌స్టా కథనంలో ఆలియా సీరియస్ అయింది.
చాలామంది కథానాయికలు తమ ముఖాకృతిని మార్చుకునేందుకు, పెదవులు, ముక్కు వంటి భాగాలను అందంగా మలుచుకునేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. ఆ విషయాన్ని పలువురు బహిరంగంగా అంగీకరించారు. అయితే కొందరు ఇలాంటి వాటిని అంగీకరించేందుకు సిద్ధంగా ఉండరు. కానీ నెటిజనుల వాదనలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తే కథానాయికలకు కోపం రావడం సహజం. ఇటీవల తనపై జరిగిన ఇలాంటి ప్రచారానికి ఆధారాలు ఉన్నాయా? అంటూ నిలదీసింది ఆలియా భట్. ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారు? అంటూ మీడియాను ప్రశ్నించింది.
అలియా భట్ ఇటీవల తన రూపాన్ని మార్చుకునేందుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని కథనాలొచ్చాయి. దీనిపై ఇన్‌స్టా కథనంలో ఆలియా సీరియస్ అయింది. ఒక సుదీర్ఘ నోట్లో మీడియా వ్యవహారాన్ని తప్పు పట్టింది. తన ముఖ కవళికలు బొటాక్స్ దుర్వినియోగాన్ని సూచిస్తున్నాయని చెబుతూ తప్పుదారి పట్టించే కథనాలు, వీడియోలను షేర్ చేస్తున్న వారిని నిలదీసే ప్రయత్నం చేసింది. వంకరగా నవ్వుతూ..విచిత్రంగా మాట్లాడే ఫోటోలు వీడియోలను ఎలా సేకరించారు? ఇలాంటి నిరాధారమైన వాదనలను తెరపైకి తెస్తారా? అంటూ ఆలియా తన నిరాశను వ్యక్తం చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా అలాంటి తీవ్రమైన ఆరోపణలు చేసేవారి స్వభావాన్ని తప్పు పట్టింది. ఆలియా ఈ పుకార్ల హానికరమైనవి అని వ్యాఖ్యానించింది.
అందాల కథానాయిక అలియా భట్ తన నోట్ లో ఇలా రాసింది. ''కాస్మెటిక్ దిద్దుబాట్లు లేదా సర్జరీని ఎంచుకునే వారిపై కచ్చితంగా ఎటువంటి తీర్పు లేదు. మీ శరీరం మీ ఎంపిక. కానీ ఇది హాస్యాస్పదంగా ఉంది! నేను బొటాక్స్ చేయించుకున్నానని ప్రచారం అవుతున్న వీడియోకి అనేక క్లిక్ లు వచ్చాయి. మీ అభిప్రాయం ప్రకారం నేను వంకరగా నవ్వుతాను..విచిత్రంగా మాట్లాడతాను.. ఇది నా ముఖం గురించిన మీ తీర్పు. నేను ఒకవైపు పక్షవాతానికి గురయ్యాను అని కూడా చెబుతున్నారు అని ఆలియా రాసింది. ఎంతటి దారుణం..! మీరు నిజంగా ఈ చెత్తను నమ్మే యువకులను ప్రభావితం చేస్తున్నారు. వార్తలను అమ్ముకునేందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు. లైక్ లు క్లిక్ ల కోసమేనా? ఇలాంటివి హానికరమైన వార్తలు. శాశ్వత ప్రభావం చూపేవి'' అని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు ఆడవాళ్లు ఇందులో ఉండడం విచారకరం.. అని కూడా ఆలియా వ్యాఖ్యానించింది. ప్రతి ఒక్కరికీ సొంత ఎంపికలు ఉన్నాయి. కానీ ఇలా దుష్ప్రచారం చేయడం తగదని కూడా సూచించారు ఆలియా.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అలియా భట్ చివరిగా వేదంగ్ రైనాతో కలిసి 'జిగ్రా'లో కనిపించింది. ఈ సినిమా ఫలితం నిరాశపరిచింది. తదుపరి ఆల్ఫా, సంజయ్ లీలా బన్సాలీ లవ్ & వార్ లైనప్‌లో ఉన్నాయి. ఇందులో ఆమె భర్త రణబీర్ కపూర్ , రాజీ సహనటుడు విక్కీ కౌశల్‌తో కలిసి నటించనుంది.