ఫ్యాన్స్ ని ఇలా సర్ ప్రైజ్ చేసావేంటి అమ్మడు?
హీరోయిన్లు నేచురల్ బ్యూటీతో కనిపించడం అన్నది చాలా రేర్. ఒకవేళ కనిపిస్తే ఎలా ఉంటుందో తెలిసిందే
హీరోయిన్లు నేచురల్ బ్యూటీతో కనిపించడం అన్నది చాలా రేర్. ఒకవేళ కనిపిస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. మ్యాకప్ లో ఎంత అందంగా కనిపిస్తారో? మ్యాకప్ లేకపోతే అంతకు మించి ఆశ్చర్యానికి గురి చేసిన భామలెంతో మంది. అలాగని నేచుర్ బ్యూటీతో మెప్పించని భామలు లేరు? అని కాదు. సహజ అందంతోనూ అలరించిన భామలెంతో మంది. మరి బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభట్ కి ముఖానికి మ్యాకప్ అస వరమా? అంటే అవసరం అనేలాగే ఈ పిక్ ఆమె బ్యూటీని హైలైట్ చేస్తుంది.
ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న పిక్ లో అలియాభట్ ఎలాంటి మ్యాకప్ వేసుకోలేదు. నేచురల్ అందంతో ఆఫోటోని లీక్ చేసింది. అందులో అలియాభట్ ఫేస్ అంతా రెడీష్ గా కనిపిస్తుంది. ముఖమంతా కందిపో యినట్లు ఫోకస్ అవుతుంది. ఇది పూర్తిగా మ్యాకప్ లెస్ స్టిల్ కావడం విశేషం. ఆ పక్కనే మ్యాకప్ తో మరో ఫోటో ఉంది. అందులో అలియా ఎంత అందంగా ఉందో కనిపిస్తోంది. ఈ రెండు ఫోటోల మధ్య వ్యత్యాసం చూపించడం కోసమే ఇలా ఈ ఫోటో లీకైనట్లు ఉంది.
నిత్యం మ్యాకప్ వేసుకోవడంతోనే కొందరు హీరోయిన్ల ముఖాలు పాడవుతుంటాయి. ఆ రంగులు..క్రీములకు అలవాటైన క్రమంలో ఫేస్ లో మార్పులు వస్తుంటాయి. అలియా ముఖంలో ఆ మార్పులు స్ఫష్టంగా కనిపి స్తున్నాయి. గతంలోనూ అలియా మ్యాకప్ లెస్ ఫోజులు కొన్ని వైరల్ అయ్యాయి. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అయితే గర్భం దాల్చిన సమయంలో శరీరం మొత్తం సహా ముఖంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.
ప్రసవం తర్వాత ఆ మార్పులు స్పష్టంగా గమనించవచ్చు. అలియాకి చెందిన అలాంటి ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజా ఫోటో కూడా వైరల్ అవ్వడంతో నెటి జనులు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఫిల్టర్ వేయకపోతే అచ్చంగా తండ్రి మహేష్ భట్ లా ఉందంటూ ఓ యూజర్ పోస్ట్ చేసాడు.