భంగిమ‌ల‌తోనే కుర్ర‌కారు కంటికి కునుకు క‌రువు

ప్రఖ్యాత మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ లో పాల్గొన్న ఆలియా ఆ ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇవ‌న్నీ క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి.

Update: 2023-10-07 16:24 GMT

అలియా భట్ తాజా ఫోటోషూట్‌లో ప్రత్యేకమైన భంగిమలు కుర్ర‌కారులో వాడి వేడి చ‌ర్చ‌కు తావిచ్చాయి. 'లగ్తా హై కమర్ మే దర్ద్ హై' అంటూ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అలియా భట్ స‌రికొత్త భంగిమ‌ల‌తో యూత్ హృద‌యాల్ని ట‌చ్ చేసింది. అలియా భట్ గ్లామర్ ఎలివేష‌న్ తాజా ఫోటోషూట్‌లో మ‌రో లెవ‌ల్లో ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.


ప్రఖ్యాత మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ లో పాల్గొన్న ఆలియా ఆ ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇవ‌న్నీ క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. మారిన రూపంతో గ్లాస్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ద‌ర్శ‌న‌మిచ్చింది. నిజానికి ఆలియా తన అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. గాంభీర్యంతో పాటు అంద‌మైన శైలిని ప్రతిబింబిస్తోంది.


ఆలియా తన గ్లాస్ మ్యాగజైన్ ఫోటోషూట్ నుండి కొన్ని ఫోటోల‌ను రిలీజ్ చేసి, రెండు ఎమోజీలు - అద్దం .. తెల్లని హృదయంతో క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోగ్రాఫర్ లీ వింక్లర్ లెన్స్ అలియా అతీంద్రియ సౌందర్యాన్ని సంపూర్ణంగా సంగ్రహించాడ‌ని చెప్పాలి. హై-స్లిట్ రెడ్ డ్రెస్ ... బొచ్చు కోటు డ్రెస్.. ఇలా ర‌కార‌కాల డ్రెస్సింగ్ ల‌తో ఆలియా క‌నిపించింది.

అలియా అద్భుతంగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు. కానీ త‌న‌ పోజులే ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమయ్యాయి. వ్యాఖ్యల‌ విభాగంలోకి ఒక వినియోగదారు మాట్లాడుతూ-''లగ్తా హై కమర్ మే దర్ద్ హై బెచారి కో'' అని రాసారు. ఆలియా ఈ కొత్త లుక్ తో ఎంతో అందంగా ఉంద‌ని చాలా మంది ప్ర‌శంసించారు.

అలియా భట్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ విజయం తర్వాత ఆలియా తన తదుపరి చిత్రం - జిగ్రా కోసం సిద్ధమవుతోంది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వాసన్ బాలా దర్శకత్వం వహించ‌నున్న జిగ్రాను అలియా కు చెందిన‌ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్- కరణ్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. కొన్ని రోజుల క్రితం, ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌స్థావిస్తూ.. తాను జిగ్రా షూటింగ్ ని ప్ర‌రంభించాని, 1 వ రోజు నుండి సెట్‌లో కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది.

Tags:    

Similar News