'హీరోలకు స్టార్ డమ్ వచ్చాక...' అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తన సమర్పణలో రూపొందిన తండేల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఈవెంట్స్ తో పాటు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఆ సమయంలో చేస్తున్న కామెంట్స్.. ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.
తాజాగా హీరోలు కథలు ఎంచుకునే రేంజ్ విషయంపై అల్లు అరవింద్ మాట్లాడారు. స్టార్ డమ్ వచ్చిన తర్వాత హీరోలు కథలు ఎంచుకునే రేంజ్ తగ్గిపోతుందా అని హోస్ట్ అడగ్గా.. నిజంగా అలాగేలా ఉందని అన్నారు. నిజానికి.. సాధారణంగా సినిమాల్లో పెద్ద పాత్రలు చేయడానికే హీరోలు పరిమితం అవుతుంటారన్న సంగతి తెలిసిందే.
ప్రయోగాలు చేయడానికి కొందరు ధైర్యం చేయరని చెప్పాలి. కెరీర్ ప్రారంభ దశలో ప్రయోగాలు చేయవచ్చు. కానీ స్టార్ డమ్ వచ్చిన తర్వాత మాత్రం పెద్దగా చేయరు. హీరోలకు స్టార్ డమ్ వస్తే.. కథలు ఎంచుకునే రేంజ్ మాత్రం టైట్ అవుతుందని అల్లు అరవింద్ వ్యాఖ్యలు బట్టి మరోసారి క్లారిటీ వచ్చినట్లే.
ముఖ్యంగా అనేక మంది హీరోలు.. స్టార్ అయ్యాక కొన్ని రకాల పాత్రలే చేయాలని ఫిక్స్ అవ్వాల్సి వస్తోందని చెప్పాలి. దాంతో కొన్ని కామన్ పీపుల్ రోల్స్ లాంటివి చేయడంలో ఆలోచనలో పడినట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో అల్లు అరవింద్.. తన కుమారుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంభాషణను కూడా పంచుకున్నారు.
"పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్లాన్స్ తో ఈ మధ్య చర్చించాను. పెద్ద కుటుంబంలో తన ఫ్యామిలీ కోసం ఏదైనా త్యాగం చేసే తమ్ముడిలా మృదువైన పాత్రలు చేయగలవా అని అడిగాను. ప్రస్తుతం బన్నీ అయోమయంలో ఉన్నా, అలాంటి మంచి కథను తీసుకురావాలని నన్ను అడిగాడు. బహుశా దానిని చేయడానికి ధైర్యం చేయవచ్చు అని తెలిపారు.
ప్రస్తుతం స్టార్ నటులతో స్మూత్ మూవీస్ తీయడం గురించి అందరూ అయోమయంలో ఉన్నారని, ఎందుకంటే ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో ఎవరికీ తెలియదని అల్లు అరవింద్ అన్నారు. ప్రేక్షకులు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తారని, వాటిని అంచనా వేయలేమని చెప్పారు. ఆరాధన లాంటి సినిమా తెలుగులో వర్కౌట్ అవ్వలేదని, చిరంజీవిని అలాంటి పాత్రలో ఆడియన్స్ అంగీకరించలేదని తెలిపారు. అదే అన్నయ్య మూవీలో చిరంజీవి మృదువైన పాత్ర పోషించినప్పుడు మాత్రం ఆదరించారని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి,.