2025 లో అల్లు అరవింద్ సరికొత్తం వ్యూహం!
గీతా ఆర్స్ట్ లో నిర్మాతగా అల్లు అరవింద్ విజయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా ఎన్నో వియాలు అందుకున్నారు.
గీతా ఆర్స్ట్ లో నిర్మాతగా అల్లు అరవింద్ విజయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా ఎన్నో వియాలు అందుకున్నారు. మరెంతో మంది స్టార్లగానూ తీర్చి దిద్దారు. ఎంతో అనుభవాన్ని సంపాదించారు. కానీ ఇంత వరకూ ఓ 500 కోట్ల బడ్జెట్ తో ఎలాంటి సినిమా నిర్మించలేదు. భారీ కాన్వాస్ పై సినిమాలు నిర్మించాలని ఉంది. కానీ సరైన కథ కుదరకపోవడంతో అది సాధ్యపడలేదు. బాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు చేసి విరమించుకున్నారు.
అయితే బాలీవుడ్ `రామాయణ్` చిత్రంలో మాత్రం భాగస్వామిగా ఉన్నారు. మరి ఈ సినిమాకు ఆయన ఎంత పెడుతున్నాడు? అన్నది క్లారిటీ లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అరవింద్ సన్నిహితుడు బన్నీ వాస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. గీతా ఆర్స్ట్ లో అల్లు అరవింద్ తదుపరి ప్రయాణంలో ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి చూస్తారన్నాడు. ఆ సంస్థలో ఎప్పుడు ఎలాంటి సినిమాలు నిర్మించాలే అరవింద్ వ్యూహం మేరకే జరుగు తుందన్నాడు.
ఈ క్రమంలో అరవింద్ తదుపరి ప్రయాణం ఇంట్రెస్టింగ్ ఉంటుందని రివీల్ చేసారు. ఆయన వ్యాఖ్యల్ని అరవింద్ తదుపరి సినిమా 500 కోట్ల బడ్జెట్ తో ఉంటుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. బాలీవుడ్ రామాయణం కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. తదుపరి సినిమా తనయుడు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తోనే నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అరవింద్ సోలోగా నిర్మించలేదు. హాసిని-హారికా సంస్థతో భాగస్వామ్యం. సినిమా బడ్జెట్ 500 కోట్లు అనే అంచనా ఉంది.
మరి భాగస్వామ్యంలో అరవింద్ శాతం ఎంత అన్నది తేలాలి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే అరవింద్ ఇలా భాగస్వామ్యంతో కాకుండా సోలోగా 500 కోట్ల బడ్జెట్ సినిమా నిర్మించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బన్నీ వాస్ వ్యాఖ్యల్ని బట్టి అది ఇదే ఏడాది నెరవేరుతుందని ఆశిస్తున్నారు. ఇటీవలే `గజనీ-2` ని మాత్రం 1000 కోట్లు పెట్టి నిర్మిస్తానని అరవింద్ ప్రకటించారు. మరి అందుకు అమీర్ ఖాన్- మురగదాస్ ముందు కొస్తారేమో చూడాలి. `గజనీ` చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి హిందీలో నిర్మించింది అరవింద్ అన్న సంగతి తెలిసిందే.