ఐదేళ్ల తర్వాత పుష్పరాజ్ గెటప్ ఛేంజ్
దానికోసం గడ్డం, మీసం, జుత్తు బాగా పెంచాడు. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా దక్కింది.
గుబురు గడ్డం.. కోర మీసం.. పొడవాటి గిరజాల జుత్తు.. ముఖంపై గాట్లు.. రఫ్‌గా రగ్డ్ గా ఆహార్యం.. ఇదీ పుష్పరాజ్ కోసం సుకుమార్ ఎంపిక చేసిన వేషధారణ. ఈ రూపం కోసం బన్ని ఎంతగా నిబద్ధుడై ఉన్నాడో ఊహించగలం. పెరిగిన గడ్డం కోరమీసాల కారణంగా తన కుమార్తె అర్హను దగ్గరకు తీసుకుని కనీసం ముద్దు అయినా పెట్టుకోలేని స్థితి ఉందని ఇంతకుముందు ముంబైలోని పుష్ప 2 ప్రచార వేదికపై బన్ని కొంత బాధను వ్యక్తం చేసారు. మూడేళ్లుగా మనస్ఫూర్తిగా చిన్నారి అర్హను ముద్దాడలేకపోయానని, ఒక తండ్రిగా ఇది ఇబ్బందికరమైన సన్నివేశమని అల్లు అర్జున్ అన్నారు. పాత్ర కోసం అది అతడి డెడికేషన్. పుష్పరాజ్ అనే స్మగ్లర్‌గా కనిపించేందుకు అతడు ఎంతో నిబద్ధతను కనబరిచాడు.
దానికోసం గడ్డం, మీసం, జుత్తు బాగా పెంచాడు. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా దక్కింది. పుష్పరాజ్ లుక్ ని పెద్దతెరపై చూసి అభిమానులు కూడా చాలా ఖుషీ అయ్యారు. గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాత్ర లుక్ పరంగా ఇన్ స్టంట్ హిట్. ఆ తర్వాత పుష్ప 1, పుష్ప 2 రెండు సినిమాలు పాన్ ఇండియన్ విజయాలతో సంచలనం సృష్టించాయి.
ఐదేళ్ల పాటు ఒకే గెటప్ తో కనిపించడం.. నిజంగా సవాల్ లాంటిదే. అయినా ఈ సవాల్ ని బన్ని నెగ్గాడు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత పుష్ప 2 లుక్ నుండి అతడు బయటకు వచ్చాడని సమాచారం. గడ్డం, పొడవాటి జుట్టును కత్తిరించి మునుపటి రూపానికి మారాడట. అయితే అందుకు సంబంధించిన కొత్త లుక్ ఇంకా బయటకు రాలేదు. 2019 నుంచి పుష్పరాజ్ పాత్ర కోసం బన్ని మేకోవర్ ప్రారంభించాడు. ఇప్పుడు 2025లో అడుగుపెట్టాం. అంటే ఐదేళ్లుగా బన్ని అదే రూపంతో ఉన్నాడు. ఇప్పుడు మారిన తన కొత్త రూపాన్ని త్వరలో సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేయడానికి సంతోషిస్తున్నట్లు సమాచారం. ఇంతకాలంగా ప్రత్యేక ఆహార్యంతో కనిపించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అర్హ నా దగ్గరకు రాదు:
ముంబైలో పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ... పొడవాటి గడ్డం కారణంగా తన కుమార్తె అర్హ తనను తప్పించుకుంటుందని పేర్కొన్నాడు. నేను క్లీన్ షేవ్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను.. ఎందుకంటే నా కుమార్తె నా దగ్గరికి రాదు.. నాకు గడ్డం ఉన్నందున నేను ఆమెను ముద్దు పెట్టుకోలేను.. అని బాధను వ్యక్తం చేసాడు. తాజా పరిణామంతో ఇక ఈ ఇబ్బంది ఇక లేదని అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. వారంతా బన్ని కొత్త స్టైల్‌లో ఎలా కనిపిస్తాడో చూడాలని ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ తాను నటించే సినిమాలో పాత్ర కోసం మేకోవర్ చేసేందుకు వెనకాడడు. అతడి డెడికేషన్ అన్నివేళలా చర్చనీయాంశమే.