పుష్ప 2: బాహుబలి లెక్కను కూడా దాటేసి..
రికార్డులు ఎప్పటికి శాశ్వతంగా ఉండవు. మారుతున్న కాలంతో పాటు సినిమాల మార్కెట్ వేల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది.
రికార్డులు ఎప్పటికి శాశ్వతంగా ఉండవు. మారుతున్న కాలంతో పాటు సినిమాల మార్కెట్ వేల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల హవా నడుస్తోంది. ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నవి టాలీవుడ్ లోనే కావడం విశేషం. 600+ కోట్ల బడ్జెట్ తో ‘కల్కి 2898ఏడీ’ మూవీ తెరకెక్కగా నెక్స్ట్ రాజమౌళి చేయబోయే మూవీ బడ్జెట్ ఏకంగా 1000 కోట్లు దాటిపోనుంది.
ఈ బడ్జెట్ లకి తగ్గట్లుగానే సినిమాల కలెక్షన్స్ కూడా ఉంటున్నాయి. ఒకప్పుడు 100 కోట్లు కలెక్షన్స్ అందుకోవడానికి తంటాలు పడే తెలుగు సినిమాలు ఇప్పుడు 1000 కోట్ల కలెక్షన్స్ ని అవలీలగా అందుకుంటున్నాయి. 500 కోట్లు కలెక్షన్స్ అయితే లెక్కలోనే లేదు. మినిమమ్ బాగుందనే టాక్ వస్తే 400 నుంచి 500 కోట్ల కలెక్షన్స్ ఈజీగా మన స్టార్ హీరోల సినిమాలకి వస్తున్నాయి. ఇక సూపర్ హిట్ టాక్ వస్తే 1000 కోట్ల పైనే కలెక్షన్స్ లెక్కలు వేసుకోవాలి.
కంటెంట్ బాగుందనే టాక్ వస్తే టికెట్ ధరలు ఎంత ఉన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమానే దానికి ఉదాహరణ. ఈ సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్న కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మౌత్ టాక్ తోనే సినిమాకి ఆదరణ పెరిగింది. ఇది కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే ‘పుష్ప 2’ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. 11 రోజులు దాటిన కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు.
కేవలం 11 రోజుల్లోనే ఈ సినిమా 561.5 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇంత కాలం హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డబ్బింగ్ సినిమాగా ‘బాహుబలి 2’ పేరు మీద ఉన్న రికార్డ్ ని ‘పుష్ప 2’ చెరిపేసింది. ‘బాహుబలి 2’ మూవీ 510.99 కోట్ల కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంది. దీనిని ‘పుష్ప 2’ కేవలం 11 రోజుల్లోనే బ్రేక్ చేసింది.
ఈ సినిమా కలెక్షన్స్ లాంగ్ రన్ లో ఇంకా పెరుగుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హిందీలో 700+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ వసూళ్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ రికార్డ్ ని నెక్స్ట్ రాజమౌళి ‘SSMB29’ బ్రేక్ చేస్తుందని ట్రెండ్ పండితులు అంటున్నారు. ఓవరాల్ గా హిందీలో టాప్ గ్రాసర్ గా ఉన్న సౌత్ సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.
పుష్ప 2 - 561.5 cr (11 days)***
బాహుబలి - 510.99 cr
కేజీఎఫ్ 2 - 434.70 cr
కల్కి 2898ఏడీ - 294.25 cr
ఆర్ఆర్ఆర్ - 274.31 cr
2.ఓ - 189.55 cr
సలార్ - 153.84 cr
సాహో - 142.95 cr
బాహుబలి 1 - 118.7 cr
పుష్ప 1 - 108.26 cr