ఆరేళ్ల వ‌య‌సుకే అమ్మాయితో జాకీర్ సాబ్ ప‌రారీ?

జాకీర్ కి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. త‌బలా పై ప్ర‌త్యేక దృష్టి ఉంది. ఈ రంగంలో కెరీర్‌గా తీసుకోవడాన్ని తన తల్లి వ్యతిరేకించిందని జాకీర్ ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు.

Update: 2024-12-16 12:23 GMT

తబలా విద్వాంసుడు, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ దివికేగిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ వార్త అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన కొంత‌కాలంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నాడు. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ కారణంగా శాన్ ఫ్రాన్సిస్కోలో 73 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఆయన కుటుంబ సభ్యులు ఈ వార్తను ధృవీకరించారు. గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాకీర్ మ‌ర‌ణ వార్త‌ దావాన‌లంలా వ్యాపించింది. నాలుగు ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో జాకీర్ ఎన్నో విజ‌యాల‌ను అందుకున్నారు. అవార్డులు రివార్డులు సొంత‌మ‌య్యాయి. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ స‌హా గ్రామీ అవార్డులను గెలుచుకున్న ప్ర‌తిభావంతుడు అత‌డు.

జాకీర్ కి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. త‌బలా పై ప్ర‌త్యేక దృష్టి ఉంది. ఈ రంగంలో కెరీర్‌గా తీసుకోవడాన్ని తన తల్లి వ్యతిరేకించిందని జాకీర్ ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు. అదే కారణంతో జాకీర్ హుస్సేన్ 6 సంవత్సరాల వయస్సులో ఒకసారి తన ఇంటి నుండి పారిపోయాడు. పూజరన్ అనే మహిళతో కలిసి ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మా ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకునే మహిళల్లో పూజరన్ ఒకరని చెప్పాడు. అతడు తన తల్లి కార‌ణంగా చాలా నిరాశ చెందాడు కాబట్టి ఇంటి నుండి పారిపోయాన‌ని సిమి గరేవాల్‌తో రెండెజౌస్‌లో ఈ సంఘటన గురించి జాకీర్ మాట్లాడాడు.

నేను పూజరన్‌తో 'మనం పారిపోదాం' అని చెప్పాను.. ఆమె కొంచెం పాట‌లు పాడేది కాబట్టి ''నువ్వు పాడతావు.. నేను ఆడతాను.. మనం జీవిస్తాము.. ఇంటి నుండి పారిపోదాం'' అని చెప్పాను అని తెలిపాడు. తన స్కూల్ బ్యాగ్‌ని ప్యాక్ చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు.. కానీ వెళ్ళలేదు. వెళ్ల‌లేక‌పోయాన‌ని జాకీర్ సాబ్ అన్నారు. జాకీర్ తన ఇంటిని వదులుకోలేకపోవడానికి తన గురువు, తన తండ్రి, అల్ల రఖా కారణమని చెప్పాడు. నాన్నపై ఉన్న ప్రేమే తనను వెళ్లకుండా ఆపిందని జాకీర్ వెల్ల‌డించాడు.

Tags:    

Similar News