అర్హ కోసం బన్నీ... మూడు ఏళ్ల తర్వాత క్లీన్‌ షేవ్‌

కానీ అల్లు అర్జున్‌ ఈ అయిదు సంవత్సరాలు అదే జుట్టు, గడ్డంతో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. తన వ్యక్తిగత జీవితంలో చాలా విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. తాజాగా అదే విషయాన్ని అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు.

Update: 2024-12-01 08:37 GMT

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా కోసం 2019 నుంచి వర్క్ చేస్తున్నారు. మధ్యలో కోవిడ్‌ కారణంగా ఏడాది పాటు పుష్ప వర్క్‌ సాగకున్నా అదే లుక్‌లో కొనసాగారు. పుష్ప కోసం అల్లు అర్జున్‌ మాస్‌ లుక్‌లో కనిపించారు. అందుకోసం పొడవాటి జుట్టు, పొడవైన గడ్డంతో అల్లు అర్జున్‌ చాలా ఏళ్లుగా కనిపిస్తూ వస్తున్నారు. ఒక సినిమా కోసం హీరో అయిదు సంవత్సరాల సమయం కేటాయించడం కొత్తేం కాదు. కానీ అల్లు అర్జున్‌ ఈ అయిదు సంవత్సరాలు అదే జుట్టు, గడ్డంతో కనిపించడం అంటే మామూలు విషయం కాదు. తన వ్యక్తిగత జీవితంలో చాలా విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. తాజాగా అదే విషయాన్ని అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు.

గత మూడు సంవత్సరాలుగా తన కూతురు అర్హను ముద్దు పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది కలిగింది. ఈ గడ్డం వల్ల చాలా ఇబ్బంది అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అంటూ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు తన పూర్తి గడ్డంను తొలగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. చాలా కాలం తర్వాత అర్హ కోసం తన గడ్డం క్లీన్‌ షేవ్‌ చేయబోతున్నాను అంటూ అల్లు అర్జున్‌ తాజా చిట్‌ చాట్‌లో చెప్పుకొచ్చారు. ఒక సినిమా కోసం, ఒక పాత్ర కోసం హీరో ఎంత వరకు ఇవ్వాలో అంతకు మించి అల్లు అర్జున్‌ పుష్ప సినిమా కోసం, పుష్పరాజ్ పాత్ర కోసం ఇవ్వడం జరిగింది. అందుకు పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్‌ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.

జాతీయ అవార్డు దక్కించుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్‌ నిలిచారు. ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో అల్లు అర్జున్‌ స్థాయిలో ఒక సినిమా కోసం, ఒక పాత్ర కోసం మరెవ్వరు కష్టపడలేదు అని ఆయనకు దక్కిన జాతీయ అవార్డును బట్టి అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్‌ అనగానే గత కొన్ని సంవత్సరాలుగా పుష్ప లుక్‌లోనే ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరూ ఊహించుకుంటూ ఉన్నాఉ. ఆయన ఏదైనా కమర్షియల్ యాడ్‌లో నటించినా పుష్ప లుక్‌లోనే కనిపించారు. గడ్డంతో పాటు తగ్గేదే లే అంటూ ఆ యాడ్స్‌లోనూ డైలాగ్‌ చెప్పడం ద్వారా ఆయన జీవితంలో ఆయన కెరీర్‌లో పుష్ప ఎంతటి కీలకమో అర్థం చేసుకోవచ్చు.

డిసెంబర్‌ 5న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సినిమా విడుదల తర్వాత వారం లేదా రెండు వారాల పాటు పోస్ట్‌ రిలీజ్ ప్రమోషన్‌లో అల్లు అర్జున్ పాల్గొంటారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం కోసం అల్లు అర్జున్‌ విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 సినిమా షూటింగ్‌ కోసం, ప్రమోషన్‌ కోసం ఆయన ఏ స్థాయిలో కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. షూటింగ్‌ లో భాగంగా ఆయన మేకోవర్‌ నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని దర్శకుడు సుకుమార్‌ పుష్ప 2 ను రూపొందించారు. రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిన ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్‌ వర్గాల టాక్‌. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయిన చోట భారీ రెస్పాన్స్ దక్కింది.

Tags:    

Similar News