అల్లు ఫ్యామిలీ కటౌట్… ఎంత నిండుగా ఉందొ..!

తాజాగా అల్లు ఫ్యామిలీ కటౌట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2024-12-03 07:36 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా అతనికి దేశ వ్యాప్తంగా క్రేజ్ తీసుకురావడమే కాకుండా ఏకంగా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ అనే పేరు ఇప్పుడు ఒక బ్రాండ్ గా మారిపోయింది. ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

ఐకాన్ స్టార్ బ్రాండ్ ఇమేజ్ ఈ సినిమాపై అంచనాలని విపరీతంగా పెంచేసింది. ఒకప్పుడు మెగా, అల్లు ఫ్యామిలీ అంతా మెగాస్టార్ బ్రాండ్ ఇమేజ్ తోనే ఇండస్ట్రీలో కొనసాగింది. అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ ఇమేజ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని అల్లు ఫ్యామిలీ హీరోగా మార్క్ క్రియేట్ చేశాడు. మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకొచ్చాడు.

అల్లు అర్జున్ ప్రత్యేకంగా బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే తాను సంతోషిస్తానని మెగాస్టార్ చిరంజీవి గతంలో ఓ ఈవెంట్ లో మాట్లాడారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం గత కొంతకాలంలో అల్లు వెర్సస్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ‘పుష్ప 2’ రిలీజ్ సందర్భంగా అది మరింత పీక్ లోకి వెళ్ళింది. కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యాన్స్ ని కించపరిచే విధంగా పోస్టర్స్ వేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

ఇలాంటి పోస్టర్స్ మెగా ఫ్యాన్స్ ని మరింత అసహనానికి గురిచేస్తున్నాయి. తాజాగా అల్లు ఫ్యామిలీ కటౌట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పుష్పరాజ్ గెటప్ లో అల్లు అర్జున్ గన్ పట్టుకొని టాప్ లో ఉన్నాడు. తరువాత అల్లు అరవింద్, అల్లు బాబీ, అల్లు శిరీష్, అల్లు అయాన్ కటౌట్ లు ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్నాయి. వీటిని బన్నీ ఆర్మీ సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ కటౌట్ పై మెగా ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ ఫ్యాన్ వార్ ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ ని ప్రభావితం చేస్తుందని నిర్మాతలు భయపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీలో టికెట్ ధరలు అయితే యధావిధిగా ఈ సినిమాకి కూడా పెంచారు. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ మాత్రం ఆగడం లేదు. ‘పుష్ప 2’ బాయ్ కట్ అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదానికి తోడు టికెట్ ధరలు కూడా భారీగా ఉండటంతో ఆ ప్రభావం మూవీ పైన పడొచ్చని అనుకుంటున్నారు.

Tags:    

Similar News