దేశాన్ని ఉర్రూత‌లూగించే టూర్‌లో అల్లు అర్జున్

ఆస‌క్తిక‌రంగా ఈ మ్యూజిక్ & డ్యాన్స్ టూర్ లో అటు ఉత్త‌రాదికి చెందిన ప్ర‌తిభావంతులు, పంజాబీ గాయ‌కుల‌తో పాటు ఇటు ద‌క్షిణాదికి చెందిన హీరోలు న‌టీమ‌ణులు పాల్గొంటుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Update: 2024-12-01 12:31 GMT

దేశ‌వ్యాప్తంగా మెట్రో న‌గ‌రాల్లో ఉర్రూత‌లూగించే మ్యూజిక్ టూర్ కోసం ప్లాన్ చేస్తున్నారు దిగ్గ‌జ పంజాబీ పాప్ గాయ‌కుడు క‌ర‌ణ్ ఔజ్లా. `ఇట్ వాజ్ ఆల్ ఎ డ్రీమ్` పేరుతో అత్యంత ఉత్కంఠభరితమైన తొలి 8-సిటీ ఇండియా అరేనా టూర్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది.

ఆస‌క్తిక‌రంగా ఈ మ్యూజిక్ & డ్యాన్స్ టూర్ లో అటు ఉత్త‌రాదికి చెందిన ప్ర‌తిభావంతులు, పంజాబీ గాయ‌కుల‌తో పాటు ఇటు ద‌క్షిణాదికి చెందిన హీరోలు న‌టీమ‌ణులు పాల్గొంటుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే రివీలైన లిస్ట్ ని ప‌రిశీలిస్తే ఈ టూర్ కి యూత్ లో ఏ రేంజులో క్రేజ్ ఉంటుందో అర్థ‌మ‌వుతోంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు క‌ర‌ణ్ ఔజ్లాతో కలిసి వీరంతా ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

అధికారిక లైనప్ ఇంకా ప్రకటించక‌పోయినా కానీ.. ఈ టూర్ లో నోరా ఫతేహి, విక్కీ కౌశల్, డివైన్, బాద్షా, KR$NA, షెహ‌నాజ్ గిల్ వంటి ప్ర‌ముఖులు ఉన్నారు. వీరితో పాటు పుష్ప 2తో సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ అల్లు అర్జున్, రష్మిక మందన్న వంటి వారి పేర్లు జాబితాలో ఉన్నాయి.

బాద్షా, డివైన్ , KR$NA వంటి ప్ర‌ముఖులు ఔజ్లాతో రెగ్యుల‌ర్ గా టూర్ల‌కు సహకరించే టీమ్ లో ఉన్నారు. వీరంతా హై-ఎనర్జీ ప్రదర్శనల కోసం ముంబై , న్యూ ఢిల్లీలో ఔజ్లాతో చేరాలని భావిస్తున్నారు. విక్కీ కౌశల్, షెహనాజ్ గిల్ ల‌కు పంజాబీ కళలు, సంస్కృతితో ఘాఢంగా అనుబంధం ఉంది. అందువ‌ల్ల ఆ ఇద్ద‌రూ చండీగఢ్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చే వీలుంది. నోరా ఫతేహి - కరణ్ ఔజ్లా కూడా ఈ టూర్ లో క‌లుస్తున్నారు.

`పుష్ప 2: ది రూల్‌`ని ప్రమోట్ చేయడానికి అల్లు అర్జున్ - ర‌ష్మిక మంద‌న్న‌ దక్షిణాది నగరాల్లో ఏదో ఒక కార్య‌క్ర‌మంలో కనిపిస్తారని పుకార్లు వ‌స్తున్నాయి. ఔజ్లాతో వేదిక‌పై క‌లిసి పుష్ప‌రాజ్ స్టెప్పులేసేందుకు వెన‌కాడ‌రని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ముంబై పర్యటనలో కరణ్ జోహార్ అతడి పరిశ్రమ స్నేహితులు హాజరయ్యే అవకాశం ఉన్న టైమ్‌లెస్ బాలీవుడ్ సౌండ్‌ట్రాక్‌లతో అద‌ర‌గొట్టే స్టార్ల‌ను వెతుకుతున్నార‌ని స‌మాచారం.

కరణ్ ఔజ్లా తన భారతదేశ పర్యటనను భారతీయ సంగీతం - పంజాబీ సంస్కృతికి సంబంధించిన ఒక ముఖ్యమైన వేడుకగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరపురాని అనుభూతిని అందించాల‌నేది ప్ర‌య‌త్నం. సంవత్సర కాలంగా అత‌డు ఈ పర్యటనను నిశితంగా ప్లాన్ చేస్తున్నాడు.

ది ఇట్ వాస్ ఆల్ ఎ డ్రీమ్ టూర్ ఇండియా లెగ్ ప‌ర్య‌ట‌న‌ డిసెంబర్ 7న చండీగఢ్‌తో మొదలవుతుంది. అటుపై డిసెంబరు 13న బెంగుళూరుతో ద‌క్షిణాదినా మొదలై ప‌లు నగరాలను కవర్ చేస్తుంది. కరణ్ ఔజ్లా డిసెంబరు 15, 18, , 19 తేదీల్లో న్యూ ఢిల్లీలో ప్రదర్శన ఇవ్వనున్నారు. డిసెంబరు 21న ముంబై లో, డిసెంబర్ 24న కోల్‌కతాలో ఈ పర్యటన కొనసాగుతుంది. డిసెంబర్ 29న జైపూర్‌లో ముగుస్తుంది.

Tags:    

Similar News