ఐశ్వర్యారాయ్ అంటే బన్నీకి అంత ఇష్టమా?
టాలీవుడ్ అగ్ర హీరోల అభిమాన హీరోయిన్లు ఎవరంటే? ఓపెన్ గా చెప్పడం కొంచెం కష్టమైన పనే.
టాలీవుడ్ అగ్ర హీరోల అభిమాన హీరోయిన్లు ఎవరంటే? ఓపెన్ గా చెప్పడం కొంచెం కష్టమైన పనే. మనసులో అభిమానించే..ఆరాధించే హీరోయిన్లు ఉన్నా! తొందరగా ఓపెన్ అవ్వరు. అందుకు చాలా కారణాలున్నాయి. వాళ్ల స్టార్ డమ్ మీద ప్రభావం చూపిస్తుందోననో...లేక మీడియాలో నెగిటివ్ ప్రచారం గా మారే అవకాశం ఉంటుందనో? ఇలా కొన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకుని అభిమాన హీరోయిన్ విషయంలో తొందరగా ఓపెన్ అవ్వరు.
కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాంటి నైజం కలవాడు కాదు. అందుకే తెలుగు అమ్మాయిలు తెలుగు పరిశ్రమకి రావాలి. ఇక్కడ సినిమాలు చేయాలి అని బలంగా చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి అయ్యాడు. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్లు ఉన్నారు? తెలుగమ్మాయిల విషయంలో బన్నీ తరహాలో ఎవరైనా భరోసా కల్పించారా? కనీసం మాట వరుసకైనా సోషల్ మీడియాలోనైనా అతని మాటకి మద్దతునిచ్చారా? అంటే లేదని తెలిసిందే.
తాజాగా 69వ జాతీయ అవార్డు వేడుకల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి మొట్ట మొదటి ఉత్తమ నటుడిగా నిలిచిన బన్నీ మరోసారి తన అభిమాన తారల విషయంలో నిరాడంబరతను చాటుకున్నారు. తనని అడగకుండా అభిమాన హీరోయిన్ పేరుని రివీల్ చేసారు. మీ అభిమాన నటులు ఎవరంటే? ముందుగా మెగాస్టార్ చిరంజీవి..సూపర్ స్టార్ రజనీ కాంత్ పేర్లు చెప్పారు.
ఇక హీరోయిన్స్ లో ఐశ్వర్యారాయ్ అంటే ఇష్టం అన్నారు. `ఆల్ టైమ్ ఫేవరెట్. ఆమె ముందు ఎవరు లేరు..ఆమె తర్వాత ఎవరూ లేరు అని తన అభిమానం..ఇష్టాన్ని చాటుకున్నారు. ఇదే ప్రశ్న మిగతా స్టార్ హీరోల్ని ఎవర్ని అయినా అడిగితే హీరోలుగా వాళ్ల నాన్నల పేర్లు చెబుతారు. లేదా? ఎవరి నుంచి ఇన్ సైర్ అయ్యారో చెబుతారు. అభిమాన హీరోయిన్ పేరు మాత్రం చెప్పరు. ఒకవేళ చెప్పినా సావిత్రి..శ్రీదేవి..కన్నంబ పేర్లు చెప్పి తప్పించుకుంటారు.
బన్నీలా ఓపెన్ గా మాట్లాడలేరు. బన్నీ మాటల్ని బట్టి ఐశ్వర్యరాయ్ ని ఎంతగా ఆరాదిస్తారో తెలుస్తుంది. రాంగోపాల్ వర్మ అతిలోక సుందరి శ్రీదేవిని ఆరాదించినట్లు..బన్నీ కూడా ఐశ్వర్యారాయ్ ని ఆరాదిస్తారంటూ కొన్ని కామెంట్లు మొదలయ్యాయి.