గుండు సెంటిమెంట్.. వర్క్ అవుట్ అవుతుందా..?
సుహాస్ లీడ్ రోల్ లో దుశ్యంత్ కటికనేని డైరెక్షన్ లో వసున్న సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతుంది
సుహాస్ లీడ్ రోల్ లో దుశ్యంత్ కటికనేని డైరెక్షన్ లో వసున్న సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు మంచి బజ్ ఏర్పరచగా ఈ వీకెండ్ రాబోతున్న చిన్న సినిమాల్లో ఈ మూవీ పైనే ఎక్కువ బజ్ ఉంది. ఈ సినిమాలో సుహాస్ సెలూన్ షాప్ నడిపించడంతో పాటుగా మ్యారేజీ బాండుకి కూడా వెళ్తుంటాడు. సినిమా ట్రైలర్ లో సుహాస్ గుండు గీయించుకున్న సీన్స్ ఉన్నాయి. కథ డిమాండ్ చేసింది కాబట్టే సుహాస్ నిజంగానే గుండు చేయించుకుని నటించాడు.
స్టార్ సినిమాల్లో ఇలాంటి గుండ్ సీన్స్ కోసం ప్రోస్తటిక్ మేకప్ ని చూజ్ చేసుకుంటారు. అయితే సుహాస్ మాత్రం నిజంగా గుండు చేయించుకుని తన ప్యాషన్ ని చూపించాడు. వెండితెర మీద గుండు సెంటిమెంట్ గురించి ఒక లుక్కేస్తే.. అది కొన్నిసార్లు వర్క్ అవుట్ అవ్వగా మరికొన్నిసార్లు మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు. హీరో గుండు పాత్ర అంటే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ లో ఒకరమైన నెగిటివిటీ ఏర్పడుతుంది.
మన హీరోల కన్నా కోలీవుడ్ లో హీరోలు ఇలా పాత్ర కోసం గుండుతో కనిపించడానికి రెడీ అంటుంటారు. అయితే గుండు తో కూడా క్రేజ్ తెచ్చాడు సూపర్ స్టార్ రజినికాంత్. శివాజీ సినిమాలో గుండు బాస్ గా రజిని మెప్పించారు. కమల్ హాసన్ కూడా అభయ్ సినిమాలో గుండుతో కనిపించి అలరించారు. గజినిలో సూర్య, సేతు సినిమాలో విక్రం, రెడ్ సినిమాలో అజిత్ ఇలా తమిళ హీరోలంతా కూడా గుండు తో కనిపించిన సినిమాలన్నీ బాగానే సక్సెస్ అయ్యాయి.
తెలుగులో మన హీరోలు ఇలా గుండు తో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. మహానాయకుడులో బాలకృష్ణ కొద్దిసేపు అలా గుండు తో కనిపించారు. అయితే బాలకృష్ణ ప్రోస్తటిక్ మేకప్ తో అలా కనిపించారు. మన స్టార్స్ చాలా సినిమాల్లో చిన్న హెయిర్ కట్ తో కనిపించారు కానీ పూర్తి గుండుతో కనిపించలేదు. తెలుగు సినిమాల్లో హీరో గుండుతో కనిపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండులో ఆ సాహసం చేశాడు. మరి ఈ గుండు సెంటిమెంట్ సుహాస్ కి కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.