పెళ్లి ఒక్కటే కాదు..కొత్త కాపురం సామాగ్రీ కూడా!
కొత్తగా పెళ్లయిన జంటకు లక్ష రూపాయల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను బహుమతిగా అందించారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల వివాహం సందర్భంగా అంబానీ కుంటుంబం కొన్ని జంటలకు సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వివాహాలు నిన్నటి రోజున నవీ ముంబైలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో గ్రాండ్ గా పెళ్లి చేసారు. ఈ వేడుకలో దాదాపు 800 మంది పాల్గొన్నారు. 50 జంటలకు ముకేష్ అంబానీ-నీతా అంబానీ దగ్గరుండి పెళ్లి జరిపించారు.
కొత్తగా పెళ్లయిన జంటకు లక్ష రూపాయల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను బహుమతిగా అందించారు. అంతకంటే ముందే అంబానీ-నీతా అంబానీ మంగళ సూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కు ఉంగరాలు కాలి ఉంగరాలు వంటివి నవదంపతులకు అందించారు. వరుడు వాళ్లు అందించిన మంగళసూత్రాల్నే వధువు మెడలో వేసారు. అనంతరం అంబానీ కుటుంబం సహా వచ్చిన వారంతా కొత్త దంపతుల జోడీలను అక్షింతలో ఆశీర్వదించారు.
అలాగే అంబానీ జోడీ కొత్త కా పురానికి అవసరమైన సామాగ్రీ మొత్తం కూడా అందించారు. కిరాణా సామాగ్రి, వంట పాత్రలు, గ్యాస్ స్టవ్, మిక్సర్, ఫ్యాన్, పరుపు దిండ్లు వంటి 36 ఇతర గృహోపకరణాలు కూడా అందించారు. నీతా అంబానీ - ఆమె కుమార్తె ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ 'స్త్రీధాన్' గా రూ. 1.01 లక్షల చెక్కును కూడా బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ, ఆనంద్ పిరమల్ కూడా పాల్గొన్నారు. ఆ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇలా సామూహిక వివాహాలు జరిపించడంపై నెటి జనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి మనసుతో ముందుకొచ్చి పెళ్లిళ్లు జరిపించడం అన్నది ఎంతో గొప్ప కార్యం. మీ ఇంట కొత్త జోడీ అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ కూడా నూరేళ్లు సంతోషంగా ఉండాలంటూ అభిమానులు దీవిస్తున్నారు.