షాకిస్తున్న మెగాస్టార్ తెలివైన పెట్టుబడులు
స్థిరాస్తి రంగం.. జస్ట్ డయల్.. స్విగ్గీ.. ! వీటన్నిటిలో మెగాస్టార్ తెలివైన పెట్టుబడులు ఆశ్చర్యపరుస్తున్నాయి.
స్థిరాస్తి రంగం.. జస్ట్ డయల్.. స్విగ్గీ.. ! వీటన్నిటిలో మెగాస్టార్ తెలివైన పెట్టుబడులు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల ఒక ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ కి చెందిన స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ రోజుల్లో డెలివరీ యాప్‌లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కేవలం రెస్టారెంట్‌ల నుండి భోజనాన్ని ఆర్డర్ చేయడానికి మాత్రమే కాకుండా కిరాణా సామాగ్రి, గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి.. చివరికి తిండి పదార్థాలను ఆర్డర్ చేయడానికి కూడా ఇవి సహకరిస్తున్నాయి. ఈ రంగంలోని కీ ప్లేయర్స్ గా ఉన్న కార్పొరెట్ దిగ్గజాలంతా వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. అందువల్ల ఈ వేదికలు పెట్టుబడిదారులను, వాటాదారులను తమ గ్రూప్ లోకి ఆహ్వానించడంలో ఆశ్చర్యం లేదు. మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ స్విగ్గీతో అనుబంధం పెంచుకున్న విషయం తెలిసిందే.
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఇప్పుడు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో వాటాను కైవసం చేసుకుంది. `ది ఎకనామిక్ టైమ్స్` కథనం ప్రకారం.. అమితాబ్ బచ్చన్ కుటుంబ కార్యాలయం(ఆఫీస్) స్విగ్గీలో చిన్న వాటాను కైవసం చేసుకుంది. ఫుడ్ డెలివరీ ఈ-కామర్స్ సంస్థ ఉద్యోగులు, ప్రారంభ పెట్టుబడిదారుల వాటాలను అమితాబ్ కార్యాలయం కొనుగోలు చేసింద``ని పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన ఆర్థిక విషయాలపై ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు.
నటుడిగానే కాకుండా.. అమితాబ్ బచ్చన్ సరైన మార్గంలో తన సంపాదనను పెట్టుబడులుగా పెట్టగలడు. అక్టోబర్ 2013లో టైమ్స్ ఆఫ్ ఇండియా `జస్ట్ డయల్`లో బిగ్ బి ఇన్వెస్ట్ చేసిన స్టాక్‌ల విలువ నాలుగు నెలల స్వల్ప వ్యవధిలో దాదాపు 10,190 శాతం పెరిగింది. దీంతో అతడి షేర్ల విలువ రూ.6.27 లక్షల అసలు పెట్టుబడి నుంచి రూ.6.45 కోట్లకు పెరిగింది. 2022లో `ది ఎకనామిక్ టైమ్స్` ఒక కథనాన్ని ప్రచురించింది. 2017 నుండి NSE SME ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ చేసినప్పుడు DP వైర్స్ షేర్ ధర 5 రెట్లు పెరిగింది కాబట్టి దీర్ఘకాలానికి స్మాల్‌క్యాప్ స్టాక్‌ను కలిగి ఉండటానికి అమితాబ్ సహనం ఫలిస్తోంది. గతంలో కూడా బిగ్ బి ఫినియోటెక్స్, బిర్లా పసిఫిక్ మెడ్స్పా, న్యూలాండ్ ల్యాబ్స్ షేర్లను సొంతం చేసుకున్నారని సదరు కథనం పేర్కొంది.
ఇటీవల అమితాబ్ బచ్చన్ ఒబెరాయ్ రియాల్టీకి చెందిన ఇంక్లైన్ రియాల్టీ నుండి దాదాపు రూ. 7 కోట్ల విలువైన బోరివలిలో అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. బాంద్రా, అంధేరి, జుహు మొదలైన ప్రధాన ప్రాంతాలకు దూరంగా బోరివలి వంటి శివారులో నివాసం కొనుగోలు చేయడం చాలా అరుదు కాబట్టి ఇది ముంబై ప్రాపర్టీ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. అదే సమయంలో అతడు ఓషివారాలో మూడు అంతస్తులలో విస్తరించి ఉన్న మూడు కార్యాలయ ఆస్తులను కూడా కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలుకు కొన్ని నెలల ముందు అమితాబ్ బచ్చన్ అలీబాగ్‌లో సీఫేసింగ్ విల్లాను నిర్మించడానికి రూ. 10 కోట్లు ఖర్చు చేసారు.