నాగ్ అశ్విన్ విజ‌న్ మ‌హ‌దాద్భుతం: అమితాబ్

ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ''కల్కి 2898 AD’ లో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. నిజంగా వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇది ఓ కొత్త ప్రపంచం.

Update: 2024-06-19 15:58 GMT

మోస్ట్ ఎవైటెడ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ 'కల్కి 2898 AD' ఈనెల 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. , విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ప్ర‌భాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటించారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అద్భుత‌మైన‌ ప్రమోషనల్ కంటెంట్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. భైరవ అంథమ్ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో వుంది. తాజాగా మేకర్స్ ముంబై లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కల్కి టీంతో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ''కల్కి 2898 AD’ లో పార్ట్ అవ్వడం గ్రేట్ హానర్. నిజంగా వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఇది ఓ కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి సినిమాని అలోచించిన నాగ్ అశ్విన్ కి, టీం అందరికీ అభినందనలు. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఏం డ్రింక్ చేస్తే ఇలాంటి కథని అలోజించగలిగాడనిపించింది. ఇందులో వున్న విజువల్స్ అన్ బిలివబుల్. ఇలాంటి ఫ్యుచరిస్టిక్ ప్రాజెక్ట్ ని తీయడం మహా అద్భుతం. తను అనుకున్న విజన్ ని వండర్ ఫుల్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. కల్కి ఎక్స్ పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను'' అన్నారు.

ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక వేదిక‌పై 81 ఏళ్ల అమితాబ్ ఎంతో ఉత్సాహంగా ఎన‌ర్జిటిక్ గా క‌నిపించారు. క‌ల్కి చిత్రంలో ఆయ‌న చావు అన్న‌దే లేని అశ్వ‌ద్ధామ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ ఇందులో భైర‌వ పాత్ర‌లో క‌నిపిస్తారు. బుజ్జి అనే రోబో అత‌డికి స‌హ‌క‌రిస్తుంది.

Full View
Tags:    

Similar News