వీరమల్లు జులై ఎంట్రీ పై నిర్మాత ఏమన్నాడు...?
అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు తనకు అప్పగించిన మత్రిత్వ శాఖలపై రివ్యూలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. మొదటి రోజు నుంచే పరిపాలనపై తనదైన ముద్ర వేసేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు తనకు అప్పగించిన మత్రిత్వ శాఖలపై రివ్యూలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు ఎప్పుడు వస్తాడు అనే చర్చ మొదలు అయ్యింది. ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ తిరిగి జులై లో షూటింగ్ కి హాజరు అవుతాడు అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో జులై లో ఆయన కెమెరా ముందుకు రావడం సాధ్యం కాకపోవచ్చు.
హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను జులై లో పునః ప్రారంభించేందుకు గాను దర్శకుడు జ్యోతి కృష్ణ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా గత రెండు మూడు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఆ విషయమై నిర్మాత ఏ ఎం రత్నం క్లారిటీ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ గారు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కు జులై నుంచి హాజరు అవ్వబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. ప్రస్తుతానికి ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆయన మాకు డేట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటాం అన్నారు.
క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా ఆలస్యం అవ్వడం వల్ల దర్శకుడు మారాడు. ఇప్పుడు సినిమా ఎప్పటికి పూర్తి అయ్యేది క్లారిటీ లేదు. పవన్ ఓజీ మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా షూటింగ్ మధ్య లో ఉన్నాయి. అవి ఎప్పటికి పూర్తి అయ్యేనో చూడాలి.