బెస్ట్ యాక్టర్ గా ఆనంద్ దేవరకొండ.. కెరీర్ లో ఫస్ట్ అవార్డ్!
ఇప్పుడు బేబీ సినిమాలో హార్ట్ టచింగ్ పెర్ఫామెన్స్ కు గాను గామా అవార్డు కైవసం చేసుకున్నారు ఆనంద్ దేవరకొండ.
ఆనంద్ దేవరకొండ... టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దొరసాని మూవీతో హీరోగా మారారు. సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా నటించిన ఆ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఓటీటీలో మిడిల్ క్లాస్ మెలోడిస్ మూవీతో ఓటీటీలోకి వచ్చారు ఆనంద్.
ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు ఆనంద్ దేవరకొండ. ఆ తర్వాత పుష్పక విమానం, హైవే వంటి చిత్రాలు చేసినా.. అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇక సాయి రాజేశ్ దర్శకత్వంలో బేబీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు బేబీ సినిమాలో హార్ట్ టచింగ్ పెర్ఫామెన్స్ కు గాను గామా అవార్డు కైవసం చేసుకున్నారు ఆనంద్ దేవరకొండ. దుబాయ్ లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు హాజరైన ఆనంద్.. గామా నిర్వాహకుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. బ్లాక్ కలర్ షూట్ లో వచ్చిన ఆనంద్.. తన లుక్స్ తో ఆకట్టుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం వేడుకను ఉద్దేశించి ప్రసంగించారు.
సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రొటీన్, రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన మూవీస్ చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆనంద్ కు కెరీర్ లో ఇదే ఫస్ట్ బిగ్ అవార్డ్. నటుడిగా ఆనంద్ టాలెంట్ కు దక్కబోయే అవార్డ్స్ కు ఇదే ఫస్ట్ స్టెప్ గా భావించవచ్చు. బేబీ సినిమాకు గాను ఆనంద్ పడిన కష్టానికి దక్కిన బహుమతిగా గామా అవార్డును వర్ణించవచ్చని సినీ పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. గం గం గణేశా, డ్యూయెట్ సినిమాలతో పాటు బేబీ టీమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో మూవీలో యాక్ట్ చేస్తున్నారు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అయితే ఆనంద్ కొత్త చిత్రాలు.. ఈ ఏడాదిలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆనంద్ దేవరకొండ.. తన కొత్త చిత్రాలతో ఎలా అలరిస్తారో చూడాలి.