LA ఫైర్: ప్రియాంక చోప్రా 170 కోట్ల భ‌వంతి సేఫేనా?

దాదాపు 30 వేల మందిని ఆ ప‌రిస‌రాల నుంచి ఖాళీ చేయించార‌ని క‌థ‌నాలొచ్చాయి.

Update: 2025-01-08 18:30 GMT

లాస్ ఏంజెల్స్ అగ్నికి ఆహుతైంది. అట‌వీ మంట‌లు దావాన‌లంలా వ్యాపించ‌డంతో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. త‌గ‌ల‌బ‌డుతున్న అడ‌వులు, భ‌వంతుల‌కు సంబంధించిన వీడియోలు గూగుల్-యూట్యూబ్‌ లో గ‌గుర్పాటుకు గురి చేస్తున్నాయి. ఈ అగ్నిప్ర‌మాదంలో మ‌ర‌ణాల గురించి కానీ, గాయాల గురించి కానీ ఇంత‌వ‌ర‌కూ స‌రైన స‌మాచారం లేదు. దాదాపు 30 వేల మందిని ఆ ప‌రిస‌రాల నుంచి ఖాళీ చేయించార‌ని క‌థ‌నాలొచ్చాయి.


త‌గుల‌బ‌డిన భ‌వంతుల్లో ప‌లువురు హాలీవుడ్ టాప్ హీరోల స్వ‌గృహాలు కూడా ఉన్నాయి. చాలా మంది టీవీ మూవీ ఆర్టిస్టులు ఆ ప్రాంతంలో నివ‌శిస్తున్నారు. LA లోని పాలిసాడ్స్ ఫైర్‌లో వారికి సంబంధించిన ఖ‌రీదైన ఆస్తులు త‌గుల‌బ‌డి బుగ్గిపాల‌య్యాయని హాలీవుడ్ రిపోర్టర్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

అయితే చాలామంది భార‌తీయుల‌ను ఒక సందేహం వెంటాడింది. లాస్ ఏంజెల్స్ లో నివాసం ఉంటున్న ప్రియాంక చోప్రా జోనాస్ ఇల్లు సుర‌క్షిత‌మేనా? అనేది ఈ డౌట్. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. ఎల్‌.ఏలో గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భ‌ర్త నిక్ జోనాస్, పిల్ల‌లు నివ‌శిస్తున్న ఇల్లు సుర‌క్షితంగా ఉంది. ఈ ఇంటిని పీసీ- నిక్ చాలా ఇష్ట‌ప‌డి కొనుక్కున్నారు. దీనికోసం దాదాపు 170 కోట్లు (20 మిలియ‌న్ డాల‌ర్లు) ఖ‌ర్చు చేసిన సంగ‌తి తెలిసిందే.

అంతేకాదు... తాజా ఘ‌ట‌న‌పై ప్రియాంక చోప్రా స్వ‌యంగా స్పందించింది. లాస్ ఏంజిల్స్‌లోని సెల‌బ్రిటీ ప్రాంతాల‌ను చుట్టుముట్టిన అడవి మంటల భ‌యాన‌క‌ దృశ్యానికి సంబంధించిన వీడియోను పీసీ షేర్ చేసింది. దిస్ ఈజ్ మ్యాడ్! అని దానికి వ్యాఖ్య‌ను జోడించింది. అగ్ని ప్ర‌మాదానికి ప్రభావితమైన ప్రతి ఒక్కరితో నా ఆలోచ‌న‌లు ప్ర‌తిబింబిస్తాయి. ఈ రాత్రి మనమందరం సురక్షితంగా ఉండగలమని ఆశిస్తున్నాను`` అని పీసీ రాసింది. ఎల్.ఏలో భీక‌ర గాలులు వీస్తున్నందున ప్ర‌మాదం ఇంకా పొంచి ఉంది. ఈ గాలులు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని కూడా చెబుతున్నారు. దీంతో ఇంకా అక్కడి ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల్లో ఉన్నారు. పీసీ వ్యాఖ్య‌లు దీనిని మ‌రింత బ‌లంగా ధృవీక‌రిస్తున్నాయి.

లాస్ ఏంజెల్స్ లో వేల ఎకరాలు త‌గ‌ల‌బ‌డ్డాయి. దావాన‌లం ఇళ్లను ధ్వంసం చేసిందని పేర్కొంటూ LAలోని పాలిసాడ్స్ ఫైర్‌ను చూపించే వీడియోల‌ను పీసీ షేర్ చేసింది. ఈ దృశ్యాల‌పై అభిమానులలో ఒక‌రు స్పందిస్తూ ``దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు చింతించకండి`` అని రాసారు. విధ్వంసకరమైన అడవి మంటలు చెలరేగిన అనంత‌రం ఆ మంటలు ఇళ్లు, కార్లు, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లను ధ్వంసం చేయడంతో 30వేల‌ మందికి పైగా స్థానికులు త‌మ ఇండ్ల‌ను ఖాళీ చేయవలసి వచ్చింది. ఈ భయంకరమైన సంఘటనకు సంబంధించిన చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో తుఫానుగా మారాయి.కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ప్రియాంక చోప్రా వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. `హెడ్స్ ఆఫ్ స్టేట్`, `ది బ్లఫ్‌` సహా ప‌లు అద్భుతమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. మ‌హేష్- రాజ‌మౌళితో ఎస్.ఎస్.ఎం.బి 29లోను ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు బాలీవుడ్ లోను క‌థ‌లు విని ఫైన‌లైజ్ చేసే ప‌నిలో ఉంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News