బిగ్ క్లాష్: వార్ -2 రిలీజ్ స్ట్రాటజీ మారుస్తుందా!
ఈ సమయంలో 'కూలీ' కూడా రిలీజ్ అయితే సౌత్ లో థియేటర్ల సమస్య తలెత్తుంది. 'వార్ -2' కోసం యశ్ రాజ్ ఫిలింస్ వందల కోట్లు ఖర్చు చేస్తుంది.
హృతిక్ రోషన్-ఎన్టీఆర్ నటిస్తోన్న 'వార్ -2' రిలీజ్ డేట్ ఇప్పటికే ఫిక్సైన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 14న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఆప్లానింగ్ కు తగ్గట్టే దర్శకుడు ఆయాన్ ముఖర్జీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించే పనుల్లో బిజీగా ఉన్నారు. తొలి నుంచి షూటింగ్ కి సంబంధించి పెద్ద షెడ్యూల్స్ వేసి పూర్తి చేస్తున్నారు.
అయితే ఇప్పుడీ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న 'కూలీ' చిత్రాన్ని దిగడానికి రెడీ అవుతుంది. ఈ చిత్రాన్ని కూడా 14వ తేదీన రిలీజ్ చేసే దిశగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియా సహా ఇతర దేశాల్లోనూ 'కూలీ' భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఆ రకంగా కూలీ-వార్-2 మధ్య క్లాష్ ఏర్పడుతుంది. ఇదే జరిగితే? రెండు సినిమాల వసూళ్ల పై తీవ్ర ప్రభావం తప్పదనే సంకేతాలు అందుతున్నాయి.
హృతిక్ సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసి 'వార్-2' రిలీజ్ ప్లాన్ చేసారు. ఇక్కడ మార్కెట్ కోసమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ప్రాజెక్ట్ లో భాగం చేసారు. తెలుగు రాష్ట్రాల్లోనూ, కన్నడలోనూ 'వార్-2' ప్రత్యేక రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా టైగర్ మార్కెట్ మీదనే ఆధార పడి ఉంది. రీజనల్ గా తారక్ సినిమాలు వందల కోట్లు వసూళ్లు తెచ్చిన చరిత్ర ఉంది. యంగ్ టైగర్ ఫ్యాన్ బేస్ తో హృతిక్ సౌత్ లో మరింత పాపులర్ అవుతారు.
ఈ సమయంలో 'కూలీ' కూడా రిలీజ్ అయితే సౌత్ లో థియేటర్ల సమస్య తలెత్తుంది. 'వార్ -2' కోసం యశ్ రాజ్ ఫిలింస్ వందల కోట్లు ఖర్చు చేస్తుంది. పెట్టిన పెట్టుబడి రెండు..మూడు రోజుల్లోనే రికవరీ అవ్వాలంటే భారీ ఎత్తున స్క్రీన్లలలో రిలీజ్ అవ్వాలి. 'పుష్ప-2' రిలీజ్ తరహాలోనే యశ్ రాజ్ ఫిలింస్ దేశ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లలను టార్గెట్ చేసిందనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని హిందీ సినిమాలు నార్త్ లో సైతం వాయిదా వేసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు మధ్యలో 'కూలీ' దూరడంతో? 'వార్ -2' రిలీజ్ స్ట్రాటజీ లో ఏమైనా మార్పులు చేస్తారేమో చూడాలి.