హీరోయిన్ తో మీ అన్నయ్య.. ఏం నడుస్తోంది?

సినిమా ప్రమోషన్స్ ని అదే సినిమాలో నటించిన ఇతర నటులతో ఇంటర్వ్యూల తరహాలో కండక్ట్ చేస్తున్నారు.

Update: 2024-05-27 07:06 GMT

టాలీవుడ్ లో ఈ మధ్యాకాలంలో వినూత్నరీతిలో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్లడానికి కొత్త కొత్తగా ఆలోచనలతో ఇంటర్వ్యూలు, టాక్ షోలు లాంటివి ఆ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. సోషల్ మీడియాలో మన సినిమా గురించి ఎంత ఎక్కువ చర్చ నడిస్తే పబ్లిక్ అంత ఎక్కువగా థియేటర్స్ కి వస్తారని భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ ని అదే సినిమాలో నటించిన ఇతర నటులతో ఇంటర్వ్యూల తరహాలో కండక్ట్ చేస్తున్నారు.

ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గంగం గణేశా మూవీ మే 31న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాండమ్ టాక్స్ అంటూ జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, ఆనంద్ దేవరకొండతో ఇంటర్వ్యూని ప్లాన్ చేశారు. ఇందులో ఇమ్మాన్యుయేల్ ఆనంద్ దేవరకొండని తనదైన శైలిలో ప్రశ్నలు వేశాడు. వాటికి ఆనంద్ దేవరకొండ కూడా వెరైటీగా సమాధానాలు చెబుతూ నవ్వించే ప్రయత్నం చేశారు.

ఇప్పటికే రాండమ్ టాక్స్ పార్ట్ 1 కొద్దిరోజుల క్రితం చేయగా అది వైరల్ అయ్యింది. తాజాగా రాండమ్ టాక్స్ పార్ట్ 2తో ఆనంద్, ఇమ్మాన్యుయేల్ మళ్ళీ వచ్చారు. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయేల్ ఆసక్తికర ప్రశ్నలు ఆనంద్ ని అడిగారు. మీ అన్నయ్య ఒక స్టార్ హీరోయిన్ ఇద్దరు ఒకే రిసార్ట్ కి వెళ్లినట్లు మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. దానికి మీరేమంటారు అని ఇమ్మాన్యుయేల్ ఫోటో చూపించి అడిగాడు.

నా దగ్గర కూడా ఫోటో ఉంది అయితే ఏంటి అంటూ ఆనంద్ రిప్లై ఇచ్చాడు. జస్ట్ కో ఇన్సిడెంట్ అంటూ ఆనంద్ చెప్పాడు. మీ అన్నకి ఆ స్టార్ హీరోయిన్ కి మధ్య ఏం నడుస్తుంది అని ఇమ్మాన్యుయేల్ అడగగా నెక్స్ట్ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తోంది అంటూ ఆనంద్ సరదాగా చెప్పాడు. ఈ సంభాషణతో ఇద్దరు మంచి ఫన్ ని జెనరేట్ చేశారు.

అయితే విజయ్, ఆ స్టార్ హీరోయిన్ అని ప్రత్యేకంగా రాండమ్ టాక్స్ లో మాట్లాడుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేది సినిమాలు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి మేగ్జిమమ్ తెలుసు. చాలా కాలంగా వారి గురించి రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే వాటికి మాత్రం ఇద్దరు ఎప్పటికప్పుడు ఎండ్ కార్డ్ పెడుతూనే వచ్చారు. అయిన కూడా రూమర్స్ కి మాత్రం ముగింపు కార్డు పడటం లేదని చెప్పాలి.

Full View
Tags:    

Similar News