కార్యక్రమంతో అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిసాయ్!
అపరకుబేరుడు ముకేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు ఆదివారం జరిగిన `మంగళ్ ఉత్సవ్` కార్యక్ర మంతో దిగ్విజయంగా ముగిస్తాయి.
అపరకుబేరుడు ముకేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు ఆదివారం జరిగిన `మంగళ్ ఉత్సవ్` కార్యక్ర మంతో దిగ్విజయంగా ముగిసాయి. ఎక్కడా ఎలాంటి ఆటకం లేకుండా వివాహ వేడుకలు పూర్తయ్యాయి. వివాహం నిశ్చమైన దగ్గర నుంచి ఆరు నెలలుగా అంబానీ ఇంట పెళ్లి ఉత్సవం మొదలైంది. అప్పటి నుంచి నిన్నటి వరకూ నిర్విరామంగా నెలకో ఈవెంట్ చొప్పున సెలబ్రేషన్స్ జరిగాయి.
వివాహ తేదీ దగ్గర పడేకొద్ది వేడుకలు మరింత వైభవంగా జరిగాయి. ఇక చివరి మూడు రోజులు వేడుక ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయేలా జరిగాయి. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ వేత్తలు, నాయకులు, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సెలబ్రిటీలు సైతం వివాహ వేడుకలో భాగమై మరింత కళను తీసుకొచ్చారు. అంబానీ ఇంట ఇదే చిట్ట చివరి వివాహం కావడంతో అంబానీ ఎక్కడా రాజీ పడకుండా వేడుకలు నిర్వహించారు.
5000 కోట్లకు పైగానే ఖర్చు చేసారు. దీంతో ప్రపంచమే అంబానీ ఇంట పెళ్లి గురించి మాట్లాడుకునేలా చేసారు. అంతకు ముందు జామ్ నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలడ్రేషన్స్ అటుపై విదేశాల్లో జరిగిన సెకెండ్ ప్రీవెడ్డింగ ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కుమారుడు అనంత్ కోసం అంబానీ బంగారు వస్త్రాలే ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. అందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసారు.
అలాగే వివాహానికి వెళ్లిన వెరీ వెరీ వెరీ ఐపాంర్టెంట్ అతిధులందరికీ రెండు కోట్ల రూపాయల విలువ చేసే వాచ్ లను బహుకరించారు. పెళ్లికి వెళ్లిన అతిధుల కోసం గిప్టులు అందించే సంప్రదాయం మాత్రం అంబానీ ఇంటనే ఉందని మరోసారి ప్రూవ్ అయింది. ఆ సంగతి పక్కనబెడితే నేటి నుంచి అంబానీ ఫ్యామిలీ మళ్లీ బిజినెస్ పనుల్లో తలమునకలవుతుంది. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ హనీమూన్ కి విదేశాలకు వెళ్లనున్నారు.