షాకింగ్: అనంత్ అంబానీ పెళ్లి ఇప్పుడే జరగదు!
నిజానికి చాలా సెలబ్రిటీ వెడ్డింగ్స్ మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలతో పాటు, కంటిన్యూటీలోనే పెళ్లి తంతు కూడా పూర్తవుతుంది.
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లెప్పుడు? పెళ్లి తేదీ ఫిక్సయిందా లేదా? అంటే.. ఇది ఊహించని ప్రశ్న. ఓవైపు గుజరాత్ జామ్ నగర్ జామ్ అయిపోయేలా అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుకలు జరుగుతుంటే ఈ చెత్త ప్రశ్న ఏమిటి అనే సందేహం కలగొచ్చు. నిజానికి చాలా సెలబ్రిటీ వెడ్డింగ్స్ మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలతో పాటు, కంటిన్యూటీలోనే పెళ్లి తంతు కూడా పూర్తవుతుంది. కానీ అనంత్ అంబానీ పెళ్లిని అలా ప్లాన్ చేయలేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే..
నీతా, ముఖేష్ అంబానీల కుమారుడు అనంత్‌కి వీరేన్- శైలా మర్చంట్‌ల కుమార్తె రాధికతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరిగింది. గత కొన్ని రోజులుగా ఇరు కుటుంబాలు ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం జామ్‌నగర్‌లో సందడి చేస్తున్నారు. దీనికోసం 1000 కోట్లు ఖర్చు చేయడం అంబానీల హద్దు లేని విలాసాలను మరోసారి తెలియజేసింది. ఈ భారీ వేడుకలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
బాలీవుడ్ సహా అంతర్జాతీయ సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు. మార్చి 1 నుంచి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గ్లామరస్ కాక్‌టెయిల్ పార్టీతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు మూడో రోజు అంటే.. ఆదివారంతో ముగిసాయి. పార్టీలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఖర్చు ప్రజలను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ జంట పెళ్లెప్పుడు? అన్న సందేహం రేకెత్తింది.
నిజానికి అనంత్-రాధిక జంట మార్చిలో పెళ్లి చేసుకోవడం లేదు. ప్రీవెడ్డింగ్ హడావుడి చూసి అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ తేదీ మార్చి 3 అని ప్రజలు భావించారు. జామ్‌నగర్‌లో ఈ జంట పెళ్లి అవుతుందని అనుకుంటున్నారు.. కానీ అది నిజం కాదు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ఈ ఏడాది జూలై 12న వివాహం చేసుకోనున్నారనేది ఇక్కడ ట్విస్టు.
మార్చి 1 నుండి 3 వరకు విలాసవంతమైన వేడుకలను మాత్రమే ప్లాన్ చేసారు. కాక్‌టెయిల్ పార్టీలో అంతర్జాతీయ స్టార్ రిహన్న సహా పలువురు దేశాధినేతలు, నాయకులు, సినీతారలు పాల్గొనడం ఆసక్తిని కలిగించింది. ఈ వేడుకలు ఆద్యంతం భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతిలోని చక్కందాన్ని ప్రతిబింబించాయి. దాండియా, గర్భాతో భారతీయ వివాహాలు ఎంత అందంగా సాగుతాయో ఆవిష్కరించింది.
జామ్‌నగర్‌లోని అంబానీల జంతు సంరక్షణ కేంద్రంలో `ఎ వాక్ ఆన్ ది వైల్డ్‌సైడ్` వేడుకలు ఆసక్తిని కలిగించాయి. 3000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వాన్తారా ఎస్టేట్‌లో జంతుప్రదర్శనశాలను అతిథులు వీక్షించారు. దీనికోసం నేపథ్య దుస్తుల కోడ్ - జంగిల్ ఫీవర్ ని ఎంపిక చేసారు. మూడురోజుల ఈవెంట్ కోసం వందలాది మంది చెఫ్ లు పని చేసారు. 1500 పైగా వెరైటీలను అతిథుల కోసం అందించారు. కేవలం ప్రీవెడ్డింగ్ కోసమే 1000-1500 కోట్లు ఖర్చు చేసిన అంబానీలు జూలై 12న జరిగే పెళ్లి వేడుకల కోసం ఇంకెంత భారీగా ఖర్చు చేస్తారో అంటూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.