కాల్ మి బే.. లైగ‌ర్ బ్యూటీకి పెద్ద ఊర‌ట‌

ఇక‌పోతే అన‌న్య కొంత‌కాలంగా స‌రైన విజ‌యం కోసం చాలా త‌పిస్తోంది.

Update: 2024-09-06 10:47 GMT

లైగ‌ర్ చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది అన‌న్య పాండే. నేటి తరం స్టార్ అన‌న్య‌కు ఇప్పుడు తెలుగులోను మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. లైగ‌ర్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఈ బ్యూటీని తెలుగు ప్ర‌జ‌లు ప్రేమించారు. ఇక‌పోతే అన‌న్య కొంత‌కాలంగా స‌రైన విజ‌యం కోసం చాలా త‌పిస్తోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో అన‌న్య పాండే న‌టించిన‌ కొత్త షో `కాల్ మీ బే` స్ట్రీమ్ అవుతోంది. దీనికి గత కొన్ని రోజులుగా టీమ్ చాలా ప్రచారం చేసింది.

అమెజాన్ ప్రైమ్‌లో కాల్ మి బే అందుబాటులో ఉంది. ఈ షోకి ప్రారంభ సమీక్షలు బాగున్నాయి . అనన్య తన నటనకు ప్రశంసలు అందుకుంది. న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న.. గ్రిప్పింగ్ స్టోరి స్క్రీన్ ప్లే దీనికి ప్ర‌ధాన బ‌లం అని స‌మీక్ష‌కులు చెబుతున్నారు.

కొల్లిన్ డి కున్హా దర్శకత్వం వహించిన `కాల్ మి బే` ఒక ధనిక మహిళ కథ‌తో రూపొందింది. ధ‌నికురాలైన యువ‌తి తన సంపదను కోల్పోయిన త‌ర్వాత జీవితం ఎలాంటి నాటకీయ మలుపు తిరిగింది? అన్న‌ది తెర‌పై చూపించారు. ధనవంతుడైన భర్త కూడా ఆమెను విడిచిపెట్టడంతో పరిస్థితులు ఎలా తలకిందులయ్యాయి? అన్న‌ది కూడా ప్ర‌ధానమైన ఎలిమెంట్.తన జీవితంలో ఎదురైన సంఘ‌ట‌న‌ల‌ను ఆ యువ‌తి ఎలా మ్యానేజ్ చేసింది? అన్న‌ది తెరపై విమ‌ర్శ‌కులు ఆసక్తికరంగా చూపించారని టాక్ వినిపిస్తోంది. ధ‌నికురాలిగా అన‌న్య న‌టన ఆక‌ట్టుకుంద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

Tags:    

Similar News