అందంతో తడాఖా చూపిస్తున్న ముద్దుగుమ్మ
తమిళ బ్యూటీ ఆండ్రియా జెరేమియా మోడల్ గా, హీరోయిన్ గా, సింగర్ గా అలరించి మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంది.
తమిళ బ్యూటీ ఆండ్రియా జెరేమియా మోడల్ గా, హీరోయిన్ గా, సింగర్ గా అలరించి మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంది. తమిళంలో పలువరు స్టార్ హీరోలకు జోడీగా నటించిన ఈ అమ్మడు ఇతర భాషల్లో కూడా నటించింది. తెలుగు లో ఆండ్రియా తడాఖా సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో మరో హీరోయిన్ గా తమన్నా నటించడం వల్ల ఆండ్రియాకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు అనేది కొందరి అభిప్రాయం. అందుకే తెలుగు లో ఆండ్రియా కి ఎక్కువ ఆఫర్లు రాలేదని, దాంతో ఆమె తమిళంకే పరిమితం అయ్యిందని సినీ విశ్లేషకులు అంటూ ఉంటారు.
తెలుగు లో ఆండ్రియా నటించకున్నా కూడా ఆమె నటించిన పలు సినిమాలు తెలుగు లో డబ్ అయ్యాయి. తడాఖా సినిమాతో మెప్పించలేక పోయినా కూడా హీరోయిన్ గా తమిళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగు నుంచి ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా సున్నితంగా వాటిని తిరస్కరించిందని సమాచారం. హీరోయిన్ గా ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు మించి చేస్తున్న ఆండ్రియా సోషల్ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా సందడి చేస్తూ ఉంటుంది. నెట్టింట ఈమె రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్ లో దాదాపుగా 3.5 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఆండ్రియా తాజాగా మరో అందమైన ఫోటోను షేర్ చేసింది. మెరూన్ కలర్ బ్లౌజ్ ధరించింది. చీరను విభిన్నంగా కట్టి ఆకట్టుకున్న ఆండ్రియా మరోసారి ఈ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నడుము అందం చూపిస్తూ థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తున్న ఆండ్రియా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందంగా ఉన్న ఆండ్రియాకు తెలుగు లో దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు, రావాల్సిన ఆఫర్లు రాలేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
తమిళ చిత్రం అన్నీయన్ లో కన్నుమ్ కన్నుమ్ నోకియా పాట పాడి ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆండ్రియా తక్కువ సమయంలోనే పలు పాటలు పాడటంతో పాటు, నటిగా కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఈ అమ్మడు తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈమె రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ రెండు సినిమాల షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. మరో రెండు మూడు చర్చల దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఇంకా బిజీ బిజీగానే ఈ అమ్మడు సినిమాలు చేయడం విశేషం.