హాలీవుడ్‌లో కోస్టార్‌ని ఆమె కూతురిని పొగిడేసిన పీసీ
అలాగే ఈ సినిమా సంగీత విభాగంలో పని చేసిన యాంజెలినా కుమార్తె వివియన్నేను పీసీ పొగిడేసింది.
ఇండియాలో తన సినిమా కమిట్‌మెంట్‌లను ముగించడంలో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా జోనాస్ నటి కం నిర్మాత ఏంజెలీనా జోలీ విజయాన్ని అభినందించడానికి తన బిజీషెడ్యూల్స్ నుంచి కొంత సమయాన్ని వెచ్చించారు. యాంజెలినా తన ఇటీవలి ప్రొడక్షన్ `ది ఔట్‌సైడర్` కోసం ఉత్తమ సంగీతానికి గాను ప్రతిష్టాత్మక టోనీ అవార్డును గెలుచుకున్నందుకు పీసీ అభినందించింది. తన స్నేహితురాలు, సహోద్యోగి సాధించిన విజయానికి ఆనందిస్తూ సుదీర్ఘమైన నోట్‌ను రాసింది. యాంజెలినాపై ప్రశంసలతో పాటు తన నటప్రతిభను కూడా ప్రశంసించింది. అలాగే ఈ సినిమా సంగీత విభాగంలో పని చేసిన యాంజెలినా కుమార్తె వివియన్నేను పీసీ పొగిడేసింది.
ఏంజెలీనా జోలీ ఆమె కుమార్తె వివియెన్ లను ఇన్ స్టా వేదికగా పీసీ అభినందించింది. ఈ విన్ కోసం యాంజెలినా కుమార్తె వివియెన్ చేసిన కృషిని కూడా మెచ్చుకుంది. జీవితంలో ఎన్నో.. మరెన్నో ప్రతిదానికీ అర్హురాలైన ఈ దేవదూతకు భారీ అభినందనలు! ది అవుట్‌సైడర్స్ కోసం ఉత్తమ సంగీతం విభాగంలో టోనీ పురస్కారాన్ని గెలుచుకున్నందుకు అభినందనలు.. అని పీసీ అన్నారు. యాంజెలినా, వివియెన్ ల సినిమా అనేక అవార్డులకు పోటీపడింది. 12 నామినేషన్లు కూడా ఉన్నాయి!!
ఏంజెలీనా జోలీ తన కుమార్తె, సంగీత దర్శకురాలు వివియెన్‌తో కలిసి మొదటిసారి ఒక సినిమాకి పని చేసింది. వివియెన్‌కు థియేటర్‌పై చాలా మక్కువ ఉందని ఈ బ్రాడ్‌వే మ్యూజికల్ నిర్మాణంలో కూడా సహాయపడిందని జోలీ ఇంతకుముందు వెల్లడించింది. డెడ్‌లైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంజెలినా ఇలా చెప్పింది. నా కుమార్తె వివ్ థియేటర్‌ని ప్రేమిస్తుంది. ఆమె ప్రపంచంలోని అన్ని థియేటర్ల(స్టేజీ డ్రామా)ను అభినందిస్తుంది. కానీ తాను దేనిని సన్నిహితంగా భావిస్తుందో .. దేనికి ఎలా స్పందిస్తుందో కచ్చితంగా తెలుసు. కాలిఫోర్నియా థియేటర్ లో `ది అవుట్‌సైడర్స్`ని ఐదుసార్లు చూడటానికి వెళ్లి దాని గురించి నాకు చెబుతోంది అని తెలిపింది.
ఎస్.ఇ రాసిన నవల ఆధారంగా రూపొందించిన మ్యూజికల్ డ్రామా చిత్రమిది. సంగీతంలో పోటీ రెండు ప్రత్యర్థి ముఠాల చుట్టూ తిరుగుతుంది. ఇది ఓక్లహోమాలోని తుల్సా నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందింది.