మ్యూజిక్ సంచ‌ల‌నాన్ని వెంటాడుతోన్న ప్లాప్ సెంటిమెంట్!

కేవ‌లం త‌మిళ్ కే ప‌రిమితం కాకుండా తెలుగు సినిమాల‌కు అగ్రిమెంట్లు వేగంగా క‌దుర్చుకుంటున్నాడు. అయితే ఇక్క‌డ అనిరుద్ ని ఓ ప్లాప్ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది.

Update: 2025-02-09 06:45 GMT

యంగ్ మ్యూజిక్ సంచ‌ల‌నం అనిరుద్ ర‌విచంద్ర‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. సౌత్ నుంచి అత్య‌ధిక డిమాండ్ ఉన్న సంగీత ద‌ర్శ‌కుడు కూడా అనిరుద్. యంగ్ సంచ‌ల‌నం మ్యూజిక్ కోసం డైరెక్ట‌ర్లే క్యూలో ఉన్నారు. అనిరుద్ అయితే సినిమాకి క‌లొసొస్తుంద‌ని స్టార్ హీరోలు సైతం అంతే బ‌లంగా విశ్వ‌శిస్తున్నారు. ఈ మ‌ధ్య అనిరుద్ కూడా తెలుగు సినిమాల‌పై దృష్టి పెట్టి ప‌నిచేస్తున్నాడు.

కేవ‌లం త‌మిళ్ కే ప‌రిమితం కాకుండా తెలుగు సినిమాల‌కు అగ్రిమెంట్లు వేగంగా క‌దుర్చుకుంటున్నాడు. అయితే ఇక్క‌డ అనిరుద్ ని ఓ ప్లాప్ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది. అనిరుద్ మ్యూజిక‌ల్ గా ఫెయిల్ కాక‌పోయినా అత‌డు సంగీతం అందించిన సినిమాలు మాత్రం ఆశించిన ఫ‌లితాలు అందించ‌డం లేదు. `లియో` ద‌గ్గ‌ర నుంచి అనిరుద్ ఇదే ప‌రంప‌ర లో క‌నిపిస్తున్నాడు. `లియో` వ‌సూళ్ల ప‌రంగా 500 కోట్లు సాధించిన‌ట్లు వికీ లెక్క‌ల్ని బ‌ట్టి తెలుస్తుంది.

కానీ ఈ సినిమా తోలి షో అనంత‌రం మిక్స్ డు టాక్ ను తెచ్చుకుంది. కొన్ని విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కుంది. లోకేష్ క‌న‌గ‌రాజ్ క్రియేటివిటీ ఏమంత గొప్ప‌గా లేద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత `ఇండియ‌న్ -2` రిలీజ్ అయింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ గా తేలింది. అటుపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర మొద‌టి భాగం రిలీజ్ అయింది. ఈ సినిమాకి వ‌సూళ్లు బాగానే వ‌చ్చాయి. కానీ టాక్ మాత్రం డివైడ్ గా రొటీన్ సినిమాగానే క్రిటిక్స్ తేల్చేసారు.

ఆ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ న‌టించిన `వెట్టేయాన్` రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. తీవ్ర న‌ష్టాలను మిగిల్చిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌లే `విదాము యార్చీ` కూడా రిలీజ్ అయింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఈసినిమా కూడా ప్లాప్ అయింది. ఇలా వ‌రుస‌గా ఐదు సినిమాలు అనిరుద్ ఖాతాలో ఫెయిల్యూర్ గా న‌మోద‌య్యాయి. కానీ మ్యూజిక‌ల్ గా ఈ సినిమాల‌న్ని మంచి విజ‌యం సాధించిన‌వే. దీంత్ అనిరుద్ సంగీతం అందించే అప్ క‌మింగ్ సినిమాలైనా ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాల‌ని అనిరుద్ అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News