అనిరుధ్‌ అలక.. ప్రమోషన్స్‌కి దూరం?

పొంగల్‌కి రావాల్సిన అజిత్‌ 'విదాముయార్చి' కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఫిబ్రవరి 6, 2025న విడుదల కాబోతోంది.

Update: 2025-02-04 10:30 GMT

పొంగల్‌కి రావాల్సిన అజిత్‌ 'విదాముయార్చి' కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఫిబ్రవరి 6, 2025న విడుదల కాబోతోంది. తమిళనాట అజిత్‌ మూవీ వస్తుందంటే ఏ స్థాయిలో హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే హంగామా కనిపిస్తుంది. అభిమానులు ఓ రేంజ్‌లో సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఎప్పటిలాగే సినిమా ప్రమోషన్‌కి అజిత్ దూరంగా ఉన్నారు. అయినా మేకర్స్ సినిమాను సాధ్యం అయినంత ఎక్కువగా ప్రమోట్‌ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హీరో ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటే దర్శకుడు, హీరోయిన్‌, సంగీత దర్శకుడు ప్రముఖంగా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

హీరోయిన్‌గా నటించిన త్రిష తనవంతు సహకారంను అందిస్తోంది. కీలక పాత్రలో నటించిన రెజీనా సైతం ప్రమోషన్స్‌లో కనిపిస్తుంది. కానీ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ మాత్రం ప్రమోషన్స్‌కి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కనీసం సోషల్‌ మీడియా ద్వారా కూడా సినిమా గురించి స్పందించడం లేదు. సాధారణంగా తాను సంగీతం అందించిన ఏ సినిమా వస్తున్నా సోషల్‌ మీడియా ద్వారా అనిరుధ్ హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. కానీ ఈ సినిమా ప్రమోషన్స్‌ లో మాత్రం అనిరుధ్ కనిపించక పోవడం చర్చనీయాంశం అయ్యింది. సినిమాకు సంగీతాన్ని అయితే అందించాడు కానీ ప్రమోషన్‌కి రాకపోవడం పట్ల కారణం ఏంటా అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌ గా మారింది.

అనిరుధ్ అలిగి ప్రమోషన్స్‌కి రావడం లేదని, ఆయన ప్రమోషన్స్‌కి దూరంగా ఉండటం వల్ల కచ్చితంగా విదాముయార్చి సినిమాకు నష్టం జరుగుతుంది అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున అనిరుధ్‌ ఈ సినిమాకు ప్రమోట్‌ చేయక పోవడం పట్ల చర్చ జరుగుతోంది. అజిత్‌ ఫ్యాన్స్ కొందరు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనిరుధ్‌ ఏ కారణం చేత సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నాడు అనేది చెప్పాల్సిందే అంటూ అజిత్‌ ఫ్యాన్స్ ఈ సందర్భంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమయంలోనే కొందరు అనిరుధ్‌ ఫ్యాన్స్ ఆయన వైపు మద్దతుగా ఉంటున్నారు.

అజిత్‌ ప్రమోషన్స్‌కి రానప్పుడు అడగని వారు అనిరుధ్‌ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ కొందరు ఈ విషయంలో అనిరుధ్‌ కి సపోర్ట్‌ చేస్తున్నారు. మొత్తానికి పెద్దగా బజ్ లేకుండా విడుదల అవుతున్న విదాముయార్చి సినిమాకు అనిరుధ్ ప్రమోషన్‌ చేయక పోవడం మరింత మైనస్ అవుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియా ద్వారా అనిరుధ్‌ సినిమాను ప్రమోట్‌ చేయాలని యూనిట్‌ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా అనిరుధ్‌ విదాముయార్చ సినిమా ప్రమోషన్స్‌కి సమయం కేటాయించడంలో విఫలం అవుతున్నారని తెలుస్తోంది. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News