ఇండియన్ సినిమాకు సరికొత్త రెహమాన్‌..!

రెహమాన్ తర్వాత ఆ స్థాయి క్రెడిట్ దక్కించుకోగల సత్తా ఉన్న సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రర్ అనడంలో సందేహం లేదు.

Update: 2023-08-12 05:17 GMT

మూడు దశాబ్దాలుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏఆర్ రెహమాన్ టాప్‌ మ్యూజిక్ డైరెక్టర్ గా... పాన్ ఇండియా స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆయన సంగీత దర్శకుడిగా తమిళ, తెలుగు, హిందీ భాష ల చిత్రాలతో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా సంగీతాన్ని అందించడం ద్వారా సుదీర్ఘ కాలంగా టాప్ పొజీషన్‌ లో కొనసాగుతున్నాడు.

రెహమాన్ తర్వాత ఆ స్థాయి క్రెడిట్ దక్కించుకోగల సత్తా ఉన్న సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రర్ అనడంలో సందేహం లేదు. విక్రమ్‌ సినిమాతో సంగీత దర్శకుడు అనిరుధ్ పాన్ ఇండియా రేంజ్‌ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సౌత్‌ లోనే కాకుండా అనిరుధ్ బాలీవుడ్ లో కూడా సందడికి సిద్ధం అయ్యాడు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ ప్రస్తుత చిత్రం జవాన్‌ కి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల అయిన జవాన్ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ అందరి దృష్టిని అనిరుధ్ ఆకర్షించాడు. జవాన్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని, మ్యూజికల్‌ హిట్ గా నిలిస్తే బాలీవుడ్ లో మోస్ట్‌ పాపులర్‌ మ్యూజిక్ కంపోజర్ గా నిలవడం ఖాయం.

హిందీ లోనే కాకుండా తెలుగు లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' సినిమాకి కూడా అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరో రెండు మూడు పెద్ద తెలుగు సినిమాలకు కూడా అనిరుధ్ సంగీతాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ్ లో తాజాగా జైలర్ సినిమా తో అనిరుధ్ మ్యూజికల్‌ సెన్షేషన్ గా మరోసారి నిలిచాడు.

పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ తో కూడా అనిరుధ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. దాంతో ఇండియన్‌ సినీ ప్రేక్షకులకు మరియు ఫిల్మ్‌ మేకర్స్ కి అనిరుధ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్ కంపోజర్ గా నిలిచాడు. అంతే కాకుండా రెహమాన్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మ్యూజిక్ కంపోజర్ గా నిలిచాడు. రెహమాన్‌ ఫేడ్‌ ఔట్ అవ్వకుండానే మరో రెహమాన్ అంటూ అనిరుధ్ ను అభిమానులు పిలుచుకుంటున్నారు.

Tags:    

Similar News