BGM కేజీఎఫ్- సలార్ రేంజ్ ఇస్తాడా?
అది ఇప్పుడు పోస్టర్లలోను కనిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన దేవర కొత్త సంవత్సరం పోస్టర్ చూడగానే చాలా సందేహాలు పుట్టుకొచ్చాయి.
ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ లో ఏ సినిమా పోస్టర్ వచ్చినా అవి యూనివర్శల్ అప్పీల్ తో మతులు చెడగొడుతున్నాయి. ఏదైనా హాలీవుడ్ సినిమాకి వెళుతున్నామా? అనే డౌట్ పుట్టిస్తున్నాయి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ తర్వాత కేజీఎఫ్ ప్రపంచం.. సలార్ ప్రపంచం ప్రజల్ని పూర్తిగా మార్చేసాయి. ఔత్సాహిక దక్షిణాది ఫిలింమేకర్స్ ఆ రెండు డార్క్ యాక్షన్ సినిమాలకు ఎంతమాత్రం తగ్గకుండా తమ పోస్టర్లను వేస్తున్నారు. అయితే ఒక సాధారణ ప్రాజెక్టుగా అనుకున్న 'దేవర' కాన్వాస్ అమాంతం మారిపోవడం, ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ స్టామినాకు తగ్గట్టుగా సినిమా రేంజును పెంచేయడం ఇక్కడ గమనించాల్సిన విషయాలు. ఎన్టీఆర్- కొరటాల ఎందులోను తగ్గడం లేదు. దేవరతో దుమారం తప్పదనే సిగ్నల్స్ ఇస్తున్నారు.
అది ఇప్పుడు పోస్టర్లలోను కనిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన దేవర కొత్త సంవత్సరం పోస్టర్ చూడగానే చాలా సందేహాలు పుట్టుకొచ్చాయి. దేవరకు 300- గ్లాడియేటర్ రేంజు గ్రాఫిక్స్, సౌండ్ డిజైన్ షురూ చేసారని, కేజీఎఫ్ - సలార్ ఇంపాక్ట్ తో భారీ యాక్షన్ విజువలైజేషన్ తో మతులు చెడగొడతారని కూడా ఊహిస్తున్నారు. అంతేకాదు దేవరకు అనిరుధ్ రవిచంద్రన్ లాంటి ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తున్నారు కాబట్టి అతడి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆశిస్తున్నారు.
'దేవర'కు అతడు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడు? బీజీఎం ఎలా ఉండబోతోంది? అంటూ ఆరాలు తీస్తున్నారు. అంతేకాదు యంగ్ యమ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కేజీఎప్ - సలార్ ని కొట్టే సినిమా కావాలని కోరుకుంటున్నారు. దేవర గ్రాఫిక్స్ పరంగా, సౌండ్ డిజైన్ పరంగా, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పరంగా ఆ స్టాండార్డ్స్ ని మించిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. అనిరుధ్ బీజీఎం చాలా ఇంపార్టెంట్ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే అతడు కేజీఎఫ్ సలార్ రేంజును మించేలా బీజీఎం ఇస్తాడా? అన్నదే ఇక్కడ పాయింట్. దేవర పోస్టర్లను డార్క్ షేడ్ లో వేయడమే ఇప్పుడు ఇలాంటి డౌట్లు తెచ్చిపెడుతుందేమో!!
దేవర కథా కమామీషు:
దేవర కథేంటనేది ఇప్పటికి సస్పెన్స్. కథాంశం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు. ఎవరికి వారు ఊహాగానాలు ప్రచురించడం తప్ప నిజమైన కథేంటో ఎవరికీ తెలీదు. కొత్త పోస్టర్ లో ఎన్టీఆర్ జీన్స్ ఫ్యాంట్ ధరించి, షర్ట్ మడతపెట్టాడు. బెల్ట్ కూడా ఉంది. దీనిని బట్టి అతడు ఆధునిక యుగపు యువకుడు అని అర్థమవుతోంది. దీనికి ఫ్లాష్ బ్యాక్ లు, చారిత్రక కథతో ముడిపెట్టినా లేదా పునర్జన్మలతో ముడిపెట్టినా లేదా పాత కాలం మాఫియాతో ముడిపెట్టినా యాక్షన్ డ్రామా పీక్స్ కి చేరుకుంటుందని మాత్రమే ఊహించగలం. కేజీఎఫ్ - సలార్ ల కోసం చేసింది కూడా అదే. కానీ దేవర అందుకు భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు.
జనవరి 8న పూర్తిగా లోడ్ చేయబడిన అల మిమ్మల్ని #DevaraGlimpseతో తాకుతుంది! అని పోస్టర్ వేసారు. నూతన సంవత్సరం సందర్భంగా సోషల్ మీడియాలో దీనిని ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ ఎ శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ కి రెండో చిత్రం దేవర. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.