గేమ్ ఛేంజర్ మంచి సినిమా.. కానీ..!

లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ సినిమా గురించి అందులో కీలక పాత్ర పోషించిన అంజలి మాట్లాడారు.

Update: 2025-01-28 04:32 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది. ఐతే సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో రాలేదు. ఐతే ఈ సినిమాకు బాగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అది ఎందుకు ఏమిటి అన్నది పక్కన పెడితే అసలు గేమ్ ఛేంజర్ సినిమా ఏంటన్నది అందులో నటించిన యాక్టర్స్ కు తెలుసు కాబట్టి సినిమా గురించి గొప్పగానే మాట్లాడతారు.

లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ సినిమా గురించి అందులో కీలక పాత్ర పోషించిన అంజలి మాట్లాడారు. ఆమె నటించిన మదగజరాజా సినిమా ప్రెస్ మీట్ లో అంజలి గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడాలంటే స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని అలా ఏర్పాటు చేస్తే గంట సేపైనా మాట్లాడతా అని అన్నారు అంజలి. సినిమా చూసి తనను కలిసిన వారంతా మంచి సినిమా అని చెప్పారని ఆమె అన్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాకు నా పాత్ర వరకు నేను 200 పర్సెంట్ ఇచ్చేశా. సినిమా గురించి మళ్లీ ప్రత్యేక చర్చ ఏర్పాటు చేసుకుందామని అన్నారు అంజలి. అంజలి కామెంట్స్ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మంచి సినిమానే కానీ కొంత నెగిటివిటీ వల్ల ఎఫెక్ట్ అయినట్టుగా ఆమె మాటల్లో అర్ధమవుతుంది. గేమ్ ఛేంజర్ సినిమాతో మళ్లీ వింటేజ్ శంకర్ గుర్తుకొస్తాడని అనుకోగా సినిమా విజువల్స్ పరంగా అదరగొట్టినా స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం రెగ్యులర్ మాస్ టెంప్లేట్ తోనే ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. ఆల్రెడీ ఈ ఇద్దరు వినయ విధేయ రామ సినిమాలో కలిసి నటించారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా రామ్ చరణ్ రెండు పాత్రల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా శంకర్ లాంటి గొప్ప దర్శకుడితో మెగా హీరో సినిమా పడిందని మెగా ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు.

Tags:    

Similar News