కుల మ‌తాల‌తో సినిమా తీస్తే OTTకి చిక్కులే

రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోపాటు 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు

Update: 2024-01-17 07:23 GMT

ఓటీటీ కంటెంట్ సెన్సార్ షిప్ ఇటీవ‌ల విస్త్ర‌తంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. క్రియేటివిటీకి తూట్లు పొడిచేందుకే ఈ సెన్సార్ షిప్ అన్న విమ‌ర్శ‌లు ఉన్నా కానీ, విచ్చ‌ల‌విడి కంటెంట్ ని అదుపులోకి తెచ్చేందుకు ఈ ప్ర‌య‌త్నం స‌రైన‌దేన‌ని అంగీక‌రించేవారు ఉన్నారు. కానీ ఓటీటీలు దీనికి స‌హ‌క‌రించేందుకు అంత ఆస‌క్తిగా లేవు.

లేడీ సూపర్ స్టార్ నయనతార న‌టించిన 'అన్నపూర్ణి' మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు స్ట్రీమింగ్ అయిన కొన్నాళ్ల‌కు OTT ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించడం హాట్ టాపిక్ అయింది. అయితే ఈ చ‌ర్య‌ల‌ను ప్ర‌ముఖ జాతీయ ఉత్త‌మ‌ ద‌ర్శ‌కుడు వేట్రిమార‌న్ ఖండించారు. ఇటీవలి మీడియా ఇంటరాక్షన్‌లో OTT వేదిక‌లలో విడుదలయ్యే చిత్రాలు సహా భారతీయ సినిమాలకు నిజాయితీ ఉన్న సెన్సార్ లేద‌ని, ఇక్క‌డ‌ సృజనాత్మక స్వేచ్ఛ లేదని వెట్రిమారన్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డ్ నుండి సినిమా ఆమోదం పొందిన తర్వాత కూడా బాహ్య ఒత్తిళ్లు స్ట్రీమింగ్ సేవల నుండి సినిమాల్ని తొల‌గించ‌డానికి దారితీస్తాయని అతుడు వాదించాడు. సినిమాలను ఆమోదించే లేదా పరిమితం చేసే బాధ్యత సెన్సార్ బోర్డ్ ఏకైక అధికారమని నొక్కి చెప్పారు. గతంలో సెన్సార్ ఆమోదం పొందిన సినిమాల‌ విడుదలకు బాహ్య ప్రభావాలు ఆటంకం కలిగించినప్పుడు బోర్డు నిర్ణయాల విశ్వసనీయత స‌రికాద‌ని అతడు ఆందోళన వ్యక్తం చేశాడు.

నయనతార నటించిన 'అన్నపూరాణి' 1 డిసెంబర్ 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఒక హిందూ బ్రాహ్మణ మహిళ చెఫ్‌గా మారడం.. (వేరొక మతానికి చెందిన ఆమె) ముస్లిం స్నేహితురాలు మాంసం వండడానికి ఆమె ఎంపికను సమర్ధించడం తెర‌పై క‌నిపిస్తుంది. అయితే ఆ మాంసం తినాలా వద్దా? అనే ఎంపికను ఆమె విచక్షణకు వదిలివేస్తుంది. ఆస‌క్తిక‌రంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా రామమందిర వేడుకలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వేళ‌ నయనతార 'అన్నపూరాణి'పై ఎఫ్ఐఆర్ నమోదు.

ఇందులోని కొన్ని సన్నివేశాలు హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ నటి నయనతారతో పాటు 'అన్నపూర్ణి'తో సంబంధమున్న ఇతరులపైనా రెండు నాయకుల సంఘాల కార్యకర్తలు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోపాటు 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. దక్షిణ ముంబైలోని లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో హిందూ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు రమేశ్ సోలంకి మరో ఫిర్యాదు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఇది మతపరమైన ఘర్షణకు దారితీసిన తర్వాత, చిత్ర బృందం ప్రజలకు క్షమాపణలు చెప్పి OTT ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించింది. అయితే అప్ప‌టికే సెన్సార్ అయిన సినిమాల‌ను ఓటీటీ నుంచి తొల‌గించ‌డాన్ని వేట్రి మార‌న్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఒక‌సారి సెన్సార్ షిప్ అయ్యాక దానిని తిరిగి పునఃప‌రిశీలించ‌డంపైనా సందేహాల్ని వ్య‌క్తం చేసారు.

Tags:    

Similar News