20 ఏళ్ల అయినా ఇప్పటికీ అలాగే?
అన్షు అంబానీ టాలీవుడ్ కి సుపరిచితమే. అమ్మడు తొలి సినిమా `మన్మధుడు` తో మంచి సక్సెస్ అందు కున్న సంగతి తెలిసిందే.
అన్షు అంబానీ టాలీవుడ్ కి సుపరిచితమే. అమ్మడు తొలి సినిమా `మన్మధుడు` తో మంచి సక్సెస్ అందు కున్న సంగతి తెలిసిందే. అటుపై ప్రభాస్ తో `రాఘవేంద్ర`.. `మిస్మమ్మ` చిత్రాల్లో గెస్ట్ అపిరియన్న్ ఇచ్చింది. కోలీవుడ్ లో `జై` అనే చిత్రంలోనూ నటించింది. ఇదే అన్షు చిట్ట చివరి సినిమా. ఇదంతా 20 ఏళ్ల క్రితం మాట. మరి అప్పుడు అవకాశాలు రాక సినిమాలు చేయలేదా? వచ్చినా కాదనకుని లండన్ వెళ్లిపోయిందా? అన్నదు తెలియదు గానీ..అమ్మడు ఇప్పటికీ సోషల్ మీడియాలో ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటడం మాత్రం విశేషమనే చెప్పాలి.
సినిమాలు చేయకపోగా...కుటుంబ జీవితంలో స్థిరపడి పిల్లల్ని కని..కాపురం లో బిజీ అయిన అమ్మడు ఇప్పటికీ అభిమానులకు టచ్ లో ఉండటం అంటే గ్రేట్ అనే అనాలి. అన్నింటికి మించి బ్యూటీ విషయం లో 20 ఏళ్ల క్రితం నాటి బ్యూటీని ఇప్పటికీ ఎక్కడా చెక్కు చెదరనివ్వలేదు. అదే లుక్..అదే గ్లామర్ మెయింటెన్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తుంది. నేను సినిమాలు చేయకపోతేనేం..తెరపై కనిపించకపోతేనేం? నేను అభిమానుల్ని కవ్వించడంలో మాత్రం ఏ మాత్రం తగ్గనంటోంది.
ఇప్పటికే అన్షు సిరీస్ నుంచి చాలా ఫోటోలు రిలీజ్ అయ్యాయి. తాజాగా అమ్మడు మరో కొత్త ఫోటో ని నెట్టింట్లోకి వదిలింది. స్లిట్ స్కర్ట్ డిజైన్ లో మైమరిపిస్తుంది. బ్రౌన్ కలర్ టాప్ లో నన్ను మించిన బ్యూటీ ఎవరు? అన్న రేంజ్ లో చెరలేగింది. నెక్ పై మ్యాచింగ్ బ్లాక్ చున్నీ తో ఆకర్షిస్తుంది. ఇక అన్షు మ్యాకప్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అమ్మడి అలంకరణ వావ్ అనిపిస్తుంది. స్కిన్ టోన్..దాన్ని మ్యాచ్ చేస్తూ ఎంపిక చేసుకున్న యాక్సరీసీస్ ప్రతీది సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది.
మునపటి ఫోటో షూట్ తో పోల్చితే? మరింత సన్నజాజి సోయగంలా తయారైంది. జీరోసైజ్ లుక్ లో కి ట్రాన్సపర్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట జోరుగా వైలర్ అవుతుంది. అన్షు అభిమానులు ఆల్ట్రామోడ్రన్ లుక్ సూపర్బ్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.