కొడుకు లేడ‌ని బాధ‌ప‌డుతోన్న న‌టుడు!

తాజాగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కూడా అలాగే మ‌న‌స్తాపానికి గురైన‌ట్లు క‌నిపిస్తుంది.

Update: 2024-10-23 02:30 GMT

బాలీవుడ్ బ్యాచిల‌ర్ స‌ల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటే? రామ్ చ‌ర‌ణ్ వ‌య‌సున్న ఓ కొడుకు ఉండేవాడ‌ని స్వ‌యంగా స‌ల్మాన్ మాట‌ల సంద‌ర్భంలో ఓసారి అన్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ అలా మాట్లాడేస‌రికి ఆయ‌న జీవితంలో అలాంటి బాండింగ్ రాసి పెట్టి లేద‌నే ఫీల్ అంద‌రిలో క‌లిగింది. స‌ల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదు కాబ‌ట్టి ఫ్యామిలీ అనే బాండింగ్ దూరమ‌య్యాడు. అయితే పెళ్లి చేసుకుని పిల్ల‌లు లేక‌పోయినా? అదే పెయిన్ ఉంటుంద‌న్న‌ది అంతే వాస్త‌వం.


తాజాగా బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కూడా అలాగే మ‌న‌స్తాపానికి గురైన‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్పుడాయ‌న వ‌య‌సు 69 ఏళ్లు. త‌న‌కంటూ ఓ కొడుకు ఉంటే బాగుండ‌ని ఆయ‌న ఇప్పుడంటున్నారు. ఓసారి అనుప‌మ్ ఖేర్ ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్తే 1979 లో న‌టి మ‌ధుమాల‌తిని ఆయ‌న వివాహం చేసుకున్నారు. కానీ కొంత కాలానికి విడిపోయారు. ఆ త‌ర్వాత 1985లో కిర‌ణ్ ఖేర్ ని రెండ‌వ వివాహం చేసుకున్నారు.

కిర‌ణ్ కి అప్పటికే వివాహం చేసుకుని భ‌ర్త‌తో విడిపోయారు. మొద‌టి భ‌ర్త‌తో సికంద‌ర్ అనే కుమారుడు క‌ల‌డు కిర‌ణ్ కి. విడాకుల అనంత‌రం 1985 లో అనుప‌మ్ ఖేర్ తో వివాహ‌మైంది. అయితే వీరికి సంతానం లేదు. ఈ నేప‌థ్యంలో అనుప‌మ్ కేర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. `కుమార్తె..కొడుకు ఉంటే బాగుండ‌ని గ‌డిచిన ఏడెనిమిదేళ్ల‌లో ఎన్నోసార్లు అనుకున్నాను. అలాగ‌ని సికింద‌ర్ తో సంతోషంగా లేనని కాదు. కానీ ఓ కొడుకు పుట్టి..వాడు నా క‌ళ్ల ముందు పెరుగుతుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది.

కానీ నేను ప‌నిలో ప‌డి అలాంటి ఆలోచ‌న చేయ‌లేక‌పోయాను. 50 ఏళ్ల వ‌య‌సులో ఆ విష‌యం గురించి ఆలోచిం చ‌చ‌డం మొదలు పెట్టాను. ఇప్పుడు ఎంతో వెలితిగా అనిపిస్తుంది. `ది అనుప‌మ్ కేర్` పౌండేష‌న్ లో పిల్ల‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తాను. నా స్నేహితుల పిల్ల‌ల్ని చూసిన‌ప్పుడు కూడానాకు పిల్ల‌లు లేరు అనే బాధ క‌లుగుతుంది` అని అన్నారు.

Tags:    

Similar News