అన్న‌య్యా అంటే ముఖం పుల్ల‌గా పెట్టిన ర‌వితేజ‌!

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు హీరోల‌ని..డైరెక్ట‌ర్ల‌ని...ముఖ్య‌మైన సిబ్బందిని అన్న‌య్య అని పిల‌వ‌డం అన్న‌ది ఎక్క‌డా జ‌ర‌గ‌దు

Update: 2024-02-03 11:15 GMT

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు హీరోల‌ని..డైరెక్ట‌ర్ల‌ని...ముఖ్య‌మైన సిబ్బందిని అన్న‌య్య అని పిల‌వ‌డం అన్న‌ది ఎక్క‌డా జ‌ర‌గ‌దు. అస‌లు అన్న‌య్య అనే ప‌ద‌మే ఇండ‌స్ట్రీలో హీరోయిన్ నోట రాకూడ‌దు. ఇది ఓ కండీష‌న్ లా ప‌నిచేస్తుంది. హీరోయిన్లు అంద‌రికీ ఇదొక రూల్ లాంటింది. హీరోయిన్లు కూడా అలాంటి వ‌ర్డింగ్ ఎవ‌రి విష‌యంలోనూ వినియోగించ‌రు. మ‌న‌సులో సోద‌ర భావం ఉన్నా ..బ‌య‌ట‌కు మాత్రం దాన్ని ప్రొజెక్ట్ చేయ‌రు.

అయితే తెలిసో తెలియ‌కో? అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌కుడు కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని అన్న‌య్య అనేయ‌డం పై ర‌వితేజ పెద్ద ర‌చ్చే చేసాడ‌ని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ కాంబినేష‌న్ లో `ఈగ‌ల్` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా గ్యాంగ్ అంతా ఒకేచోట చేరారు. ర‌వితేజ‌..అనుప‌మ‌..న‌వ‌దీప్..అవ‌స‌రాల శ్రీనివాస్ పాల్గొన్నారు. మాట‌ల మ‌ధ్య‌లో అనుప‌మ ద‌ర్శ‌కుడు కార్తీక్ ని అన్న‌య్య అని సంబోంధించింది.

దీంతో ఆమె ప‌క్క‌నే ఉన్న ర‌వితేజ నువ్వు కార్తీక్ ని అన్నయ్యా? అని పిలుస్తావా? అంటూ ముఖం పుల్ల‌గా పెట్టి మూతి బిగించాడు. అంద‌మైన అమ్మాయిలు అన్న‌య్య అనే వ‌ర్డ్ వాడ‌కూద‌మ్మా? నేను ఎందుకు చెప్పానో అర్దం చేసుకో అన్నాడు. ఆ త‌ర్వాత అనుప‌మ‌తో కార్తీక్ అని ప్రేమగా పిలిపించాడు. కార్తీక్ తో నాలుగు సినిమాల‌కు ప‌నిచేసిన అనుభ‌వంతో అనుప‌మ అన్న‌య్య అనే చ‌నువు తీసుకున్నాను అన్నా? స‌రే ర‌వితేజ మాత్రం ఒప్పుకోలేదు.

ఇంకా న‌యం అదే ర‌వితేజ‌ని..అనుప‌మ అన్న‌య్యా? అని పిలిస్తే ఆయ‌నెంత ఫీలైపోయేవాడో? ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈగ‌ల చిత్రం ఫిబ్ర‌వ‌రి 9న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతు న్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని తెర‌కెక్కించాడు.

Tags:    

Similar News