బెండకాయ..దొండకాయ కనిపిస్తే ఆగలేని బ్యూటీ!
లేదా ఉన్నట్లుండి ఒక్కసారిగా మూడీగా మారిపోతుందిట. అలాగని కోపాన్ని...సంతోసషాన్ని..మూడీ నెస్ ని మనసులో పెట్టుకుని ఎక్కువగా డిస్టబెన్స్ కాదుట.
పుర్రికోబుద్ది జిహ్వకో రుచి! అన్న చందంగా రుచులను ఆస్వాదించడంలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. నాన్ వెజ్ ప్రియులు కొంతమందైతే వెజ్ ప్రియులు..పెరుగన్నం ప్రియలు మరికొంత మంది. మరి మల యాళం బ్యూటీ అనుపమపరమేశ్వరన్ ఎక్కువగా ఏ తరహా రుచుల్ని ఆస్వాదిస్తుంది అంటే! అమ్మడు అన్ని కలిపి కుమ్మేస్తాను అంటొంది. అవును అనుపమ ఎంతో ఇష్టంగా నాన్ వెజ్ వంటకాలు ఆరగిస్తుందిట.
అలాగని పక్కా నాన్ వెజ్ ప్రియురాలు కాదు..వెజ్ ఐటమ్స్ సైతం అంతే ఇష్టంగా తింటుందిట. అందులోనూ బెండకాయ...దొండకాయ కర్రీ..ప్రై కనిపిస్తే అస్సలు ఆగలేదుట. రోజు తినేదాని కన్నా రెండు..మూడు ముద్దలు ఎక్కువగానే లాగించేస్తుందిట. అలాగే కిచెన్ గదిలోకి దూరి వంట కూడా అంతే ఇష్టం చేస్తుందిట. ఇంట్లో మామ్ కి సహాయం చేయడంలోనూ ముందుంటుందిట.
ఖాళీ ఉంటే టైంపాస్ అంతే వంటగదిలోనే చేస్తానంటోంది. ఇక చికెన్ ఐటమ్స్ లో చికెన్ స్ట్యూ బాగా చేస్తుందని తిన్నవాళ్లు అంతా మెచ్చుకుంటారుట. అప్పుడొచ్చే ఆనందమే వేరు అంటోంది. తను తినడం కన్నా తను వండిన వంటకాలు ఇతరులు తిని బాగుందని చెబితే ఎంతో సంతోష పడుతుందిట. అలాగే అమ్మడు కోపిస్ట్ కూడా. కొన్ని సందర్భాల్లో చటుక్కున కోపం వచ్చేస్తుందిట.
లేదా ఉన్నట్లుండి ఒక్కసారిగా మూడీగా మారిపోతుందిట. అలాగని కోపాన్ని...సంతోసషాన్ని..మూడీ నెస్ ని మనసులో పెట్టుకుని ఎక్కువగా డిస్టబెన్స్ కాదుట. అవన్నీ ఆ క్షణం వరకే పరిమితం చేస్తుందిట. శత్రువు లైనా మళ్లీ కనిపిస్తే స్నేహంగా పలకరించడం..మాట్లాడటం చేస్తుందిట. ఆ రకమైన పాజిటివ్ యాంగిల్ తనలో చాలా వరకూ ప్లస్ గా ఉందని చెబుతుంది. ప్రస్తుతం అనుపమ సినిమాలు బాగానే చేస్తోంది. అవకాశాలు వచ్చిన విజయాలు లేకపోవడంతో తిరిగెళ్లిపోవడం ఖాయమనుకుంటోన్న సమ యంలో విజయాలు నమోదయ్యాయి. అప్పటి నుంచి అవకాశాలు బాగానే అందుకుంటోంది.