అల్లు అర్జున్ జాతీయ అవార్డుతో కలత చెందిన నటుడు?

అనుప‌మ్ త‌న‌కు ఆ పుర‌స్కారం ద‌క్క‌లేద‌ని కొంత అసంతృప్తికి లోనైనా కానీ అవార్డులు అందుకున్న వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపాడు.

Update: 2023-08-25 17:08 GMT

ప్ర‌తిష్ఠాత్మ‌క 69వ జాతీయ‌చ‌ల‌న‌చిత్ర అవార్డుల్లో 'ఉత్త‌మ న‌టుడు' పుర‌స్కారాన్ని అల్లు అర్జున్ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప చిత్రంలోని న‌ట‌న‌కు గాను అత‌డిని ఈ పుర‌స్కారం వ‌రించింది. అయితే ఈ అవార్డ్ అత‌డికి ద‌క్క‌డం ప్ర‌ముఖ హిందీ న‌టుడికి అంత‌గా రుచించ‌లేదంటూ గుస‌గుస వినిపిస్తోంది.

నిజానికి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 'ది కాశ్మీర్ ఫైల్స్' జాతీయ సమగ్రతపై ఉత్తమ చలనచిత్రంగా నర్గీస్ దత్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ ప్రకటన తర్వాత ఇందులో న‌టించిన‌ అనుపమ్ ఖేర్ ట్విట్ట‌ర్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఉత్త‌మ న‌టుడు అవార్డ్ కూడా ద‌క్కి ఉంటే అద్భుతంగా ఉండేదని కూడా పేర్కొన్నాడు.

అయితే 'పుష్ప: ది రైజ్' చిత్రంలో న‌టించిన‌ అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అనుప‌మ్ త‌న‌కు ఆ పుర‌స్కారం ద‌క్క‌లేద‌ని కొంత అసంతృప్తికి లోనైనా కానీ అవార్డులు అందుకున్న వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపాడు.

ది కాశ్మీర్ ఫైల్స్ జాతీయ సమగ్రతపై #బెస్ట్ ఫీచ‌ర్ ఫిలిం గా ప్రతిష్టాత్మకమైన అత్యంత ముఖ్యమైన #నేషనల్ అవార్డు - నర్గీస్ దత్ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషంతో పాటు గర్వంగా ఉంది. నటుడిగానే కాకుండా సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా మా సినిమాకు ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉంది. నా నటనకు కూడా అవార్డు వ‌చ్చి ఉంటే బావుండేది. మరల ఇంకెప్పుడైనా వ‌స్తుందేమో! విజేతలంద‌రికీ నా హృదయపూర్వక అభినందనలు! జై హో! అని అనుప‌మ్ ఖేర్ రాశాడు.

ది కాశ్మీర్ ఫైల్స్ లో నటించిన పల్లవి జోషి ఉత్తమ సహాయ నటి జాతీయ అవార్డును అందుకోవడం గమనించదగ్గ విషయం. ది కాశ్మీర్ ఫైల్స్ కి ద‌క్కాల్సిన కేట‌గిరీలో జాతీయ అవార్డులు ద‌క్కాయి. ఈ సినిమాకి ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌లేద‌న్న‌ది అంద‌రికీ తెలుసు.

Tags:    

Similar News