యానిమ‌ల్ స్టార్‌తో డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్ బిగ్ ప్లాన్?

అయితే త‌న ఆలోచ‌న‌ల‌ గురించి, మ‌ళ్లీ ర‌ణ‌బీర్ తో క‌లిసి ప‌ని చేయాల‌నే ఉద్ధేశం గురించి ఇప్పుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ మాట్లాడారు. వివ‌రాల్లోకి వెళితే...

Update: 2023-12-14 02:45 GMT

2015 లో విడుద‌లైన‌ 'బాంబే వెల్వెట్'లో రణ్‌బీర్ కపూర్ నటించ‌గా అనురాగ్ క‌శ్య‌ప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ర‌ణ‌బీర్ న‌టించిన తాజా బ్లాక్ బ‌స్ట‌ర్ 'యానిమ‌ల్' మ‌ళ్లీ అనురాగ్ లో కొత్త ఆలోచ‌న‌ల‌కు తావిచ్చింది అంటూ పుకార్ షికార్ చేస్తోంది. అయితే త‌న ఆలోచ‌న‌ల‌ గురించి, మ‌ళ్లీ ర‌ణ‌బీర్ తో క‌లిసి ప‌ని చేయాల‌నే ఉద్ధేశం గురించి ఇప్పుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ మాట్లాడారు. వివ‌రాల్లోకి వెళితే...

రణబీర్ కపూర్ 'యానిమల్' పాత రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. 500 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ర‌ణ‌బీర్ ఎదిగాడు. ఇలాంటి స‌మ‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్యప్ మళ్లీ ఒక ప్రాజెక్ట్ కోసం కపూర్‌తో కలిసి పనిచేయాలనే ఆలోచన గురించి మాట్లాడారు.

అనురాగ్ మాట్లాడుతూ-''అతడి(ర‌ణ‌బీర్‌)తో పని చేయడానికి ఎవరు ఇష్టపడరు? కానీ నేను అలా అనుకోను... అంగీకరించడానికి చాలా సమయం పడుతుంది. బ్లాక్‌బస్టర్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఫార్ములా లేదు. ఒక స్టార్ తో ప్రయోగాలు చేసినప్పుడు నేను విమర్శ‌ల‌కు గుర‌వుతున్నాను. అలాగే ఆ స్టార్ ప‌రిస్థితి కూడా అంతే'' అని అన్నారు. ఒక వ్యక్తి స్టార్ అయినప్పుడు అత‌డు అభిమానులను పొందుతాడు. ఫ్యానిజం అనే ప‌దం అభిమాని నుండి వచ్చింది. కాబట్టి అభిమానులు తమ స్టార్‌ను ఒక నిర్దిష్ట మార్గంలో చూస్తారు. అభిమాన సంఘాలు తమలో తాము నిరంతరం పోరాడుతున్నాయి. అన్ని ఫ్యాన్స్ క్లబ్‌ల మధ్య నాన్‌స్టాప్‌గా అదృశ్య యుద్ధం జరుగుతోంది. కాబట్టి మీరు ఆ ఫ్యాన్‌ క్లబ్‌కు సేవ చేయకపోతే, ఆ స్టార్‌తో సినిమా తీయడం ఫిలింమేక‌ర్స్ కి సవాలుతో కూడుకున్న పని'' అని అన్నారు.

ఇటీవ‌ల యానిమ‌ల్ కంటెంట్ పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పైనా అనురాగ్ స్పందించారు. ఈ దేశంలోని ప్రజలు సినిమాలతో తేలిగ్గా మనస్తాపం చెందుతారు. నా సినిమాల విష‌యంలోను వాళ్లు కూడా బాధపడతారు. కానీ విద్యావంతులు ఎంతమాత్రం బాధపడకూడదని నేను ఆశిస్తున్నాను... అని అన్నారు.

సందీప్ వంగాను అనురాగ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. ప్ర‌తిసారీ విమ‌ర్శ‌లొస్తాయ‌ని అన్నారు. కబీర్ సింగ్ విష‌యంలోను ఇలానే జ‌రిగిన‌ విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. ఈ చర్చ కబీర్ సింగ్ సమయంలో కూడా జరిగిందని అన్నారు. ఫిల్మ్ మేకర్స్‌కి వారు కోరుకున్న ఏదైనా సినిమా తీయడానికి.. కోరుకున్న దానికి ప్రాతినిధ్యం వహించే హక్కు ఉంది. మనం వారిని విమర్శించవచ్చు.. వాదించవచ్చు.. విభేదించవచ్చు.. అని అన్నారు. సినిమాలు రెచ్చగొట్టడం లేదా ప్రేరేపించడంపైనా మాట్లాడుతూ.. రెచ్చగొట్టే సినిమాలను తీసే దర్శకనిర్మాతలతో నాకు ఎలాంటి సమస్య లేదు! అని కూడా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News