అనుష్క.. ఇన్నాళ్ళకు సీక్వెల్ సర్ ప్రైజ్?

ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే మాట వినిపిస్తోంది. సూపర్ హిట్ మూవీ 'భాగమతి' సీక్వెల్ కి ఆమె ఒకే చెప్పిందంట.

Update: 2024-09-20 03:43 GMT

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న అందాల భామ అనుష్క. ఈ జెనరేషన్ లో ఎవ్వరు చేయలేని క్యారెక్టర్స్ ని అనుష్క చేసి మంచి సక్సెస్ లు అందుకుంది. అనుష్క అంటే ఒక 'అరుంధతి', 'బాహుబలి' సీరీస్ లు గుర్తుకొస్తాయి. అందులో పాత్రలకి ఆమె తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరేమో అనేంతగా తన నటనతో అనుష్క అందరిని ఆకట్టుకుంది. అలాగే స్వీటీ కెరియర్ లో 'భాగమతి' సినిమాకి ప్రత్యేక స్థానం ఉంటుంది.

ఆ సినిమాలో అనుష్క నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. రెండు భిన్నమైన షేడ్స్ లో ఆమె క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సినిమా చూసేవారికి ఒక థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ని 'భాగమతి' మూవీ ఇచ్చింది. ఈ సినిమాకి థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అని చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ కథని దర్శకుడు అశోక్ అద్భుతంగా నేరేట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.

'బాహుబలి' సిరీస్ తర్వాత సోలోగా అనుష్క ఈ సినిమాతోనే పెద్ద సక్సెస్ అందుకుంది. భారీ కలెక్షన్స్ ని మూవీ కొల్లగొట్టింది. అదే స్పీడ్ లో ఫీమేల్ సెంట్రిక్ కథలతో వరుస సినిమాలు చేసేంత రేంజ్, మార్కెట్ అనుష్కకి ఉంది. అయిన కూడా సెలక్టివ్ గా మనసుకి నచ్చే కథలు మాత్రమే చేస్తూ వచ్చింది. అనుష్క చివరిగా గత ఏడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే మాట వినిపిస్తోంది. సూపర్ హిట్ మూవీ 'భాగమతి' సీక్వెల్ కి ఆమె ఒకే చెప్పిందంట. డైరెక్టర్ అశోక్ ఇప్పటికే ఇంటరెస్టింగ్ కథని సిద్ధం చేసి అనుష్కకి వినిపించాడని టాక్. ఆమెకి కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేసిందని సమాచారం. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.

యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. 'భాగమతి' సీక్వెల్ పడితే కచ్చితంగా అనుష్క ఖాతాలో 100 కోట్ల కలెక్షన్స్ చేరుతాయని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. మరి 'భాగమతి' సీక్వెల్ పై సోషల్ మీడియాలో నడుస్తోన్న ఈ సీక్వెల్ ప్రచారం ఎంత వరకు వాస్తవమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News